వాట్సప్ గ్రూప్ లు విచిత్రాలు!!!

వాట్సప్ గ్రూప్ లు విచిత్రాలు!!!

వాట్సాప్ గ్రూప్
మీలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ లో చేరిన వాళ్ళే లేకపోతే మీరే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానిలోకి అందరిని ఆడ్ చేసిన వాళ్ళే!!!
నిజం చెప్పాలంటే ఒక్కోసారి వాట్సాప్ గ్రూప్ లో ఆ గ్రూప్ అడ్మిన్ కూడా అంత ఆక్టివ్ గా ఉండడు!!!
ఇకపోతే వాట్సాప్ గ్రూపు లు వాటి పేర్లు
చెడ్డి దోస్తుల గ్రూప్
SSC 2007 బ్యాచ్ గ్రూప్
ఇలాగే ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ 
ఫ్యామిలీ గ్రూప్
వారసుల గ్రూప్
వంశం గ్రూప్
ఆఫీస్ గ్రూప్
వాలీబాల్ క్రికెట్ ఇంకా పలు ఆటల గ్రూప్
కిట్టి పార్టీ గ్రూప్
తెలుగు సాహితీ ప్రియుల గ్రూప్
అలనాటి NTR, ఏఎన్నార్ ల నుంచి ఈరోజు విజయ్ దేవరకొండ  వరకు ఫ్యాన్స్ గ్రూప్
వీ లవ్ ట్రావెల్ గ్రూప్
ఫుడీ ఈ గ్రూప్
బ్లడ్ డోనర్స్ గ్రూప్
అపార్ట్మెంట్స్ గ్రూప్
గేటెడ్ కమ్యూనిటీ గ్రూప్
కులం గ్రూప్
మతం గ్రూప్
ప్రాంతం గ్రూప్
ఫేస్బుక్ ట్విట్టర్ షేర్ చాట్ గ్రూప్
స్కూల్ కాలేజీ యూనివర్సిటీ గ్రూప్
అబ్బో ఇలా చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. ఈ గ్రూపు లో అన్నిటిలో చాలా కామన్ గా జరిగే ఏకైక విషయం పొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజులు 
ఫార్వర్డ్ చేయడం రాత్రికి గుడ్ నైట్ మెసేజులు ఇక ఇన్స్పిరేషన్ అని జోకుల  నాలెడ్జ్ అని జాగ్రత్తలు చెప్తూ ఫేక్ అని వైరల్ అయిందని బ్రేకింగ్ అని ఎవరైనా చనిపోతే రిప్ అని కొంతమంది అత్యుత్సాహ పరులు తమ పర్సనల్ ఫోటోలు కూడా గ్రూప్ లో పెడుతూ తమ వాట్సప్ కు వచ్చిన ఫోటోలు వీడియోలు ఆడియోలు అన్నిటినీ జిహెచ్ఎంసి డంప్ యార్డ్ లో వేసినట్టు ఆ గ్రూపులో వేస్తుంటారు
ఇక గ్రూపులో మొత్తం 100 మంది ఉంటే కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు మిగతా వారితో పలకరింపులు అసలే ఉండవు.
ఆక్టివ్ పార్టిసిపెంట్స్
గ్రూపులో కొంతమంది ఆక్టివ్ పార్టిసిపెంట్స్ ఉంటారు
వీలు కచ్చితంగా రోజుకు పది మెసేజ్ లు అయిన 
గ్రూప్ లో పెడుతుంటారు.  పాపం గ్రూపులో వీళ్ళను ఏవ్వరు పట్టించుకోకున్నా వీళ్ళ ఉత్సాహం వీళ్ళదే
నిజం చెప్పాలంటే అసలు గ్రూప్ నిలబడితే ఇలాంటి వాళ్ళ వల్ల!!!
ఇక ప్యాసివ్ పార్టిసిపెంట్స్
పేరుకు మాత్రమే గ్రూప్ లో ఉంటారు కానీ ఒక్క రోజు ఒక్క  మెసేజ్ కి కూడా రిప్లై ఇచ్చి ఉండరు. గ్రూపులో పెట్టే అన్ని మెసేజ్ లు చదువుతారు కానీ రిప్లై ఇవ్వడానికి బద్ధకం. ఈ వాట్సాప్ గ్రూప్ ఆయన త్వరగానే మూత పడింది అంటే దానికి ప్రధాన కారణం ఈ మహానుభావులే!
ఇకపోతే అటు ఇటు కానీ పార్టిసిపెంట్స్
వీళ్లో రకం సడన్ గా నిద్ర లేచినట్టు ఉంటుంది వీళ్ళ తీరు
ఒకరోజు ఒక మెసేజ్ కూడా రిప్లై ఇవ్వని వాడు సడన్ గా ఒక రోజంతా గ్రూప్ లో మెసేజ్ ల  మీద మెసేజ్  లు
పెడుతూనే ఉంటాడు. మళ్లీ ఆ తర్వాత రోజు నుంచి షరా మామూలే!!
నిజంగా నిజాయితీగా ఉండే పార్టిసిపెంట్స్
నిజం చెప్పాలంటే వీళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్  తమ    ఫ్రెండ్స్ తోనో తమ కొలీగ్స్ తో నో తమ ఫ్యామిలీ తో నో
జెన్యూన్ గా టచ్ లో ఉండాలని గ్రూపులో ఉండే వాళ్ళు
గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి మెసేజ్ కి వీళ్ళు స్పందిస్తారు. ఎదుటివారి బాధను అయినా ఆనందాన్ని అయినా వీళ్లు పంచుకోగలరు గ్రూప్లో ఉన్న మిగతా మెంబర్స్ అందరూ  
వాళ్ల జీవితంలో ఎలా ఉన్నారు  ఏం చేస్తున్నారు అన్న విషయాలు వీరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.
ఇక ఈ కామెడీ విషయాలను పక్కన పెడితే నిజంగా వాట్సాప్ గ్రూప్లో వల్ల కొంత మేరకు మంచి కూడా జరుగుతుంది. అత్యవసరంగా రక్తం ఉన్నవాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి జాబ్స్ గురించి ఏమైనా నోటిఫికేషన్  మంచి/ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రావెలింగ్  గాడ్జెట్  ఆఫర్ లు నాలెడ్జ్ ఆన్లైన్ మోసాలు పాజిటివ్ విషయాలు ఇలా చాలా వాటి గురించి తమ తమ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని అన్ని విధాలుగా ఎడ్యుకేట్ చేస్తూ మంచి చేస్తున్న గ్రూప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇది ఏమేమి ఏది ఏమైనా పది మంది కలిసి 10 విషయాలను షేర్ చేసుకుంటూ ఒకరికొకరు దూరంగా ఉన్న వాట్సాప్ గ్రూప్ ద్వారా కలిసి ఉండడం తమ బంధాలను కాపాడుకోవడం అన్నవి మంచి విషయాలు కాబట్టి ఈ వాట్స్ అప్ గ్రూపులు ఇలాగే ఫార్వర్డ్ మెసేజ్ లతో మంచి మంచి నాలెడ్జ్ షేరింగ్ తో పదిమందికి పనికివచ్చే పనులతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

విజయ్ దేవరకొండ 100 కోట్లు

Sun Dec 30 , 2018
విజయ్ దేవరకొండ 100 కోట్లు విజయ్ దేవరకొండ బిజినెస్ 100 కోట్లు దాటేసింది,అతి తక్కువ కాలంలో స్టార్డం తెచ్చుకోవడం అంటే ఈ పోటీ ప్రపంచంలో సాధారణమైన విషయం కాదు, కానీ విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోలు ఒకే ఒక్క సినిమాతో  వాళ్ళ కెరీర్ నే మార్చుకోవడం చాలా గొప్ప విషయం  అని చెప్పాలి,ఇప్పటికే rowdies అని తన    బ్రాండ్ ను మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ అది త్వరలోనే  100 కోట్లకు  చేరువ కానుందని అన్నారు, ఈ సినిమా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: