విజయ్ హీరో మహేష్ బాబు విలన్ మురుగు దాస్ తో సినిమా!!


Vijay and Mahesh Babu
సినిమాల్లో ఒకప్పుడు విలన్ లుగా వేస్తూ ఆ తర్వాత స్లో గా హీరోలుగా ప్రమోట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ముందే హీరోలుగా అయ్యి ఆ తర్వాత తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కూడా మళ్ళీ విలన్ పాత్రలకు కూడా ఒకే చెబుతున్న ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది ఇది ఒక్క తెలుగులోనే కాదు హిందీ తమిళ్ కన్నడ భాషలో కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే కోవలోకి మన టాలీవుడ్ ప్రిన్స్ మహెష్ బాబు ఎంటర్ అవబోతున్నాడు అది కూడా విలన్ గానే కనిపించబోతున్నాడు. నిజానికి తెలుగు నాట అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అపారంగా ఉన్న మహేష్ బాబుకి సినిమాల్లో 39ఏళ్ళ జర్నీ ఉంది. అవును మరి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కావడంతో నాలుగేళ్ల ప్రాయంలోనే 1979లో నీడ అనే సినిమాలో నటించాడు. మహేష్ బాబు మొత్తం 9సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వేసాడు. ఇక 1999లో రాజకుమారుడు మూవీతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే మహేష్ బాబు ఒక్కడు పోకిరి లాంటి సినిమాలతో సూపర్ స్టార్ అయ్యాడు.ప్రస్తుతం తను చేస్తున్న మహర్షి సినిమా 25 వది దీనికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహింస్తున్నాడు.మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన విలేజ్ సెట్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వేసవి కానుకగా మే 9న మహర్షి మూవీని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాల్లో ఉంది. జయసుధ,ప్రకాష్ రాజ్,సాయికుమార్ కీలకపాత్రలు పోషించే మహర్షి మూవీలో మహేష్ ఫ్రెండ్ గా కామెడీ హీరో అల్లరి నరేష్ చేస్తున్నాడు.

ఇందులో మహేష్ పేరు ఋషి,అల్లరి నరేష్ పేరు రవి. ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మహేష్ బాబు అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చేస్తున్నారు. పోతే ఈ మధ్య తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు మళ్ళీ మొదలు పెట్టారు మల్టీ స్ట. ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ పేరిట దర్శక ధీర ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుకుతోంది. ఇప్పుడు దీనికి పోటియా అన్నట్టు తమిళంలో విజయ్ హీరోగా ఓ భారీ చిత్రం ప్లాన్ చేశారట.

అయితే ఈ కథలో విలన్ పాత్ర కీలకం కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ను హీరో విజయ్ దర్శకుడు మురుగు దాస్ సంప్రదించారట మహేష్ కూడా స్టోరీ తన పాత్ర బాగా నచ్చి ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు తమిళ భాషల్లో వచ్చే ఈ చిత్రంలో తమిళంలో విజయ్ హీరో అయితే,మహేష్ విలన్ గా వేస్తారట. అదే తెలుగులో మహేష్ హీరోగా చేస్తే తమిళ హీరో విజయ్ విలన్ గా నటిస్తారట. ఇంతకు ముందు మహేష్ తో స్పై డర్ తీసిన మురుగుదాస్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కబోతోందట. ఈ న్యూస్ నిజమైతే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అలాగే ఈ చిత్రం మీద క్రెజ్ కూడా విపరీతంగా ఉంటుందని చెప్పొచ్చు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అలా నిలబడ్డాడు అంతే పిక్ వైరల్ అయిపోయింది..

Thu Mar 7 , 2019
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అలా నిలబడ్డాడు అంతే పిక్ వైరల్ అయిపోయింది.. Tags: katamarayudu,tseries telugu,pawan kalyan (organization founder),shriya saran (award winner),daggubati venkatesh (award winner),gopala gopala video songs,gopala gopala songs,gopala gopala hit songs,telugu latest songs,telugu songs,telugu hit songs,telugu movie trailer,t-series,tseries,janasena speech,telugu videos,telugu movies,hot videos,jukebox,trailer,latest video songs,telugu 2019 movies, https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: