వినయ విధేయ రామ సినిమా ఫ్లాపే అంటున్న రామ్ చరణ్

వినయ విధేయ రామ సినిమా ఫ్లాపే అంటున్న రామ్ చరణ్

రామ్ చరణ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ సంక్రాంతికి విడుదల అయిన సినిమా వినయ విధేయ రామ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విజేతగా  నిలబడలేకపోయింది సినిమా మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి అయితే ఈ సినిమా గురించి రామ్ చరణ్ పబ్లిక్ గా స్పందించారు నిజానికి ఈ సినిమా కోసం తమ యూనిట్ అందరం చాలా కష్టపడ్డామని కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమా జనాలకు నచ్చలేదని దానికి నేను చాలా బాధపడుతున్నాను అని ఇక ముందు మంచి మంచి చిత్రాలు అందించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో ఈ విషయం చెప్పారు.

నిజానికి సినిమా రిలీజ్ రోజు నెగిటివ్ టాక్ బయటకు వచ్చిన వినయవిధేయ రామ సినిమాకి దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఇంకో పక్క F 2 సినిమా ఫ్యామిలీ సినిమా అవడం దానికి జనాల నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సంక్రాంతి విజేతగా నిలిచింది. వినయ విధేయ రామా సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయి అని విమర్శలు రావడంతో సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే కొన్ని యాక్షన్ దృశ్యాలను కూడా సినిమాలో నుంచి తొలగించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తను నటించిన సినిమా ఫ్లాప్ అయినా కూడా దాన్ని ఒప్పుకోకుండా సినిమా హిట్ అంటూ ప్రమోషన్ చేసుకునే హీరోలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రామ్ చరణ్ లాంటి ఒక పెద్ద హీరో తన సినిమా పబ్లిక్ గా ఒప్పుకోవడం గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Anushkasharma’s doppelgänger in American singer Julia Michaels

Tue Feb 5 , 2019
Anushkasharma’s doppelgänger in American singer Julia Michaels https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: