విశాల్‌ నిశ్చితార్థం-Photos

విశాల్‌ నిశ్చితార్థం-PhotosMade for Each Other Vishal-Anisha

తమిళ కథానాయకుడు విశాల్‌, నటి అనీశాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు విశాల్‌, అనీశాకు శుభాకాంక్షలు చెప్పారు. సెప్టెంబరులో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం.

vishal-anisha

అనీశాను ప్రేమిస్తున్నానని విశాల్‌ జనవరిలో ప్రకటించారు. ‘అవును.. చాలా సంతోషంగా ఉంది. ఆమె పేరు అనీశా. నా ప్రేమను అంగీకరించింది. నా జీవితంలో రాబోతున్న అతి పెద్ద మార్పు ఇది. నిశ్చితార్థం, పెళ్లి తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘అయోగ్య’ సినిమా చిత్రీకరణ సమయంలో అనీశాను కలిశానని విశాల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మంచితనం నచ్చి ముందు తనే ప్రపోజ్‌ చేసినట్లు తెలిపారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

మోదీ బయోపిక్‌ - తొమ్మిది గెటప్స్ లో వివేక్ ఒబెరాయ్

Thu Mar 21 , 2019
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: