వెరైటీ టైటిల్ తో నాగ శౌర్య!!


నాగ శౌర్య యూత్ లో మంచి క్రేజ్ వున్న ఈ యువ హీరో ఛలో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కూడా ఆ వెంటనే చేసిన నర్తనశాల తో మళ్లీ ఫ్లాప్ లోకి వెళ్లి పోయాడు. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు హీరో నాగశౌర్య. కెరీర్ లో కొంచం వెనుక పడ్డా ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు ఓకె చేస్తున్నాడు. సమంత నందినీ రెడ్డి బేబి లో ఒక పాత్ర చేస్తున్నాడు దాని షూటింగ్ దాదాపు పూర్తయిపోతోంది.ఇది కాక తను సోలో హీరోగా అవసరాల శ్రీనివాస్ డైరక్షన్లో ఓ సినిమా మొదలయింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
అలాగే మరో రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడు అయితే అవి స్టార్ట్ అవ్వాల్సి వుంది.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో తయారవుతున్న సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసార ట. అదే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి అన్న టైటిల్.అటు క్లాస్ ఫన్, ఇటు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పెట్టింది పేరు. ఈ సినిమా టైటిలే ఇలా పెట్టారు అంటే కచ్చితంగా మళ్లీ తనదైన స్టయిల్ లోనే ఆయన మరో సినిమా అందించబోతున్నారని మనం చాలా బలంగా ఫిక్స్ అవ్వచ్చు.

అవసరాల శ్రీనివాస్ ఇప్పటికే రెండు సినిమాలు శౌర్యతో మనకు అందించారు. అవి ఒకటి ఊహలు గుసగుసలాడే, రెండవది జో అచ్యుతానంద రెండో దాంట్లో నాగ శౌర్య తో నారా రోహిత్ హీరోగా చేశాడు ఇలా తన తొలి రెండు చిత్రాల లో శౌర్య తో కలిసి work చేశాడు అవసరాల శ్రీనివాస్. ఈ రెండు చిత్రాల టైటిల్స్ సినిమా పాటల టైటిళ్లు పెట్టిన ఆయన ఈసారి మాత్రం ఇలా డిఫరెంట్ టైటిల్ ఎంచుకున్నారు. మరి ఇది కూడా తన గత చిత్రాల మాదిరిగానే ఫన్ గా లవ్ స్టోరీ తోనే వుంటుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఆ తమిళ రీమేక్ లో రామ్??

Tue Mar 12 , 2019
టాలీవుడ్ లో అసలే. హిట్ సినిమాలు లేక హీరోలు దర్శకులు అల్లాడి పోతున్న తరుణంలో సరైన కథ ఎక్కడ దొరకుతుందా అన్న వేట విపరీతంగా సాగుతోంది. ఈ మధ్య ఎక్కువగా ఫ్లాప్ లలో వున్న హీరో రామ్ కోసం ఈ వేట ఇంకా ఎక్కువగా సాగుతుంది. అయితే ఈ వేట ఆగిందని లేటెస్ట్ గా ఓ తమిళ సినిమా హక్కులను హీరో రామ్ కోసం కొన్నారని వార్తలు వస్తున్నాయి. థ డ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: