వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి పాత్ర పోషిస్తున్న జగపతిబాబు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి పాత్ర పోషిస్తున్న జగపతిబాబు

                                                     Image credited from Twitter.com

యాత్ర దివంగత జననేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రం. ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో గొప్ప పేరును పలుకుబడిని సంపాదించుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత 2004 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ను అందించడం ద్వారా సామాన్య ప్రజల్లో ఎనలేని అభిమానాన్ని చూరగొన్నారు. ఆ తర్వాత మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా అఖండ మెజారిటీతో గెలిచి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే 2009 సెప్టెంబర్ 3 న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన అనుకోకుండా మరణించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పెను మార్పులు సంభవించాయి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది.
                                                  image credited from filmbeat.com
అయితే అంతటి గొప్ప నేత ప్రజల నుంచి ఎంతో అభిమానాన్ని పొందిన వైస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆనందోబ్రహ్మ లాంటి కామెడీ సినిమా తీసిన మహి వి రాఘవ్ సినిమా గా రూపొందిస్తున్నారు. ఎప్పుడైతే మలయాళ నటుడు మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి గా నటిస్తున్నారు అని తెలిసిందో ఆ రోజు నుంచి ఈ సినిమా మీద మంచి అంచనాలు వచ్చాయి. టీజర్ రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా వైస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సినీ ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ బజ్ ను తీసుకురాగలిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజ రెడ్డి పాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు పోషిస్తున్నారు ఇప్పటికే హీరోగా విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జగపతిబాబు 2018వ సంవత్సరంలో వచ్చిన రంగస్థలం అరవింద సమేత లాంటి సినిమాల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఒకపక్క నందమూరి బాలకృష్ణ తన తండ్రి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయో పిక్ గా తీస్తుండగా మరోపక్క డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రావడం యాదృచ్చికమే అయినప్పటికీ ఇద్దరు నాయకులు తెలుగు ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానాలు ఎంతో గొప్పవి. ఎన్ని సంవత్సరాలు గడిచిన వీరిద్దరూ ప్రజల గుండెల్లో ఉండిపోయే గొప్ప నాయకులుగా చరిత్రలో నిలిచిపోయారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఒంటరి పోటీనే అంటున్న పవన్ కళ్యాణ్!!!

Thu Jan 3 , 2019
ఒంటరి పోటీనే అంటున్న పవన్ కళ్యాణ్!!!                                                    image credited from livemint.com పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ బడా స్టార్ కు ఉన్న క్రేజ్ అసాధారణమైనది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: