వైష్ణవ తేజ్ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై హీరోగా పరిచయమవుతున్న వైష్ణవ తేజ్ సినిమాలో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తారనే వార్త సినిమా సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. సాయి ధరంతేజ్ తమ్ముడిగా అటు చిరంజీవి మేనల్లుడు గా వైష్ణవ తేజ్ సినిమా కి ఇప్పటికే చిన్న హైప్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు కూడా పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నీ తీసుకుంటున్నారనే సమాచారం ఈ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో ఉండబోతున్న ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ టచ్ చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి లాంటి భారీ చిత్రంలో ఒక పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి మళ్లీ ఇప్పుడు మరో తెలుగు సినిమా కూడా ఒప్పుకోవడంతో ఇక మీదట తనకి తెలుగులో అవకాశాలు పెరుగుతాయని చెప్పొచ్చు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రజనీ కాంత్ పేరును ఎవరూ వాడు కోవద్దంట!!

Mon Feb 18 , 2019
తమిళ్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. రెండు మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న టెన్షన్ మొన్నటి వరకు నడిచింది అయితే ఇప్పుడు రజినీకాంత్ ఏకంగా తాను ఈ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని చెప్పడం చర్చనీయాంశం అయింది. తమ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: