శంకర్ కమల్ హాసన్ ల ఇండియన్ 2 లో విలన్ గా అక్షయ్ కుమార్!!

శంకర్ కమల్ హాసన్ ల ఇండియన్ 2 లో 

విలన్ గా అక్షయ్ కుమార్!!

శంకర్ కమల్ హాసన్ ల కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఇండియన్ అదేనండి మన తెలుగులో  భారతీయుడు సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా ఇండియన్2 అనే సినిమాని రూపొందిస్తున్నారు. భారతీయుడు సినిమాలో ముసలి తాత పాత్రను మాత్రమే తీసుకుని ఈ సినిమాని సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్2 సినిమాలో విలన్ పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ని అనుకుంటున్నారట ఇంతకుముందే అక్షయ్ కుమార్ శంకర్ రజనీకాంత్  తో తీసిన రోబో 2 సినిమాలో పక్షిరాజు పాత్రలో విలన్ గా నటించాడు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. దాంట్లో పక్షిరాజు పాత్ర చేసిన అక్షయ్ కుమార్ కి అనేక ప్రశంసలు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఇండియన్ 2 సినిమాలో కూడా అక్షయ్ కుమార్ చేత విలన్ పాత్ర చేయించాలని డైరెక్టర్ శంకర్ అనుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో హీరోగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ రోబో2 సినిమాతో విలన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే కమల్ హాసన్ తో ఇండియన్ 2 లాంటి భారీ సినిమా తీస్తున్న శంకర్ కు కమల్ కు పోటీగా దీటుగా నటించే నటుడు ఎవరు అన్న ప్రశ్నకి అక్షయ్ కుమార్ రూపంలోనే మంచి సమాధానం దొరికినట్లు ఉంది.
భారతీయుడు సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆ సినిమా ఇంకా ఇప్పటికీ సరికొత్త గానే ఉంటుంది. భారతీయుడులో అవినీతి మీద తన బాణాలను ఎక్కుపెట్టిన శంకర్ ఇప్పుడు తాను రూపొందించబోయే భారతీయుడు 2 సినిమా లో కూడా అవినీతి వ్యవస్థ గురించే చర్చించబోతున్నారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా దీంట్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్పుడు తన ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ తో సినిమాలు తీసే శంకర్ ఈ సినిమాకి మాత్రం తమిళ యువ సంగీత సంచలనం అనిరుద్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఓ వైపు నటుడు కమలహాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తన పార్టీని ప్రకటించి ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు మరొకవైపు ఇప్పుడు భారతీయుడు 2 సినిమా లో ఎలాంటి విషయాల గురించి చర్చించబోతున్నారు ఆయన మనసులో ఉన్న ఆలోచనలు కానీ ఈ సమాజం గురించి ప్రజల గురించి కమల్ హాసన్ కు ఉన్న అభిప్రాయాలు గాని ఈ సినిమాలో ఏమన్నా చూపిస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కెసిఆర్ శత్రువు కాళ్ల బేరానికి వచ్చాడు

Thu Jan 17 , 2019
కెసిఆర్ శత్రువు కాళ్ల బేరానికి వచ్చాడు కాళ్ల బేరానికి వచ్చిన కెసిఆర్ శత్రువు ఎవరని ఆలోచిస్తున్నారా అదేనండి మన ఒంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ లో కెసిఆర్ మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంతకు ముందు 2014 ఎలక్షన్స్ లో కూడా ఆయన కేసీఆర్ మీద గజ్వేల్ లో పోటీ చేసి పరాజయం పొందారు. మళ్లీ మొన్న జరిగిన 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  ప్రతాపరెడ్డి  […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: