శకుంతలా దేవి హిందీ మూవీ రివ్యూ విద్యా బాలన్ షో!!!

1

శకుంతలా దేవి హిందీ మూవీ రివ్యూ విద్యా బాలన్ షో!!!

శకుంతలా దేవి మూవీ రివ్యూ రేటింగ్ 3.5/5


ఇండియన్ మ్యాథ్స్ జీనియస్ శకుంతల దేవి రియల్ లైఫ్ ఆధారంగా తీసిన ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. తన తెలివితేటలతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచి కంప్యూటర్నే ఓడించిన శకుంతల దేవి జీవితాన్ని ఆవిడ కూతురు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా ఇది, వరల్డ్ ఫేమస్ శకుంతలా దేవి ఒక తల్లిగా ఎందుకు ఫెయిల్ అయ్యిందో చూద్దాం.
కథ : ఇది వరల్డ్ ఫేమస్ శకుంతల దేవి కథ, ఆవిడ గురించి అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పుకునేదేది లేదు. అసలు స్కూల్ కు వెళ్ళకుండానే ఎవరి దగ్గరా చదువుకోకుండానే శకుంతలా మ్యాథ్స్ జీనియస్ అవడం, తనని తండ్రి షోస్ కు తీసుకెళుతూ డబ్బులు సంపాదించడం, అందరి పిల్లల్లా తను స్కూల్ కు వెళ్లకపోవడం, ఆడుకోకపోవడం ఆవిడ లైఫ్ లో పెద్ద డిజప్పాయిమేంట్. ఒక వ్యాధితో బాధ పడే తన అక్క శారద డబ్బులు లేక చనిపోవడంతో శకుంతల తన తల్లితండ్రుల్ని ముఖ్యంగా తల్లిని ద్వేషిస్తుంది తను తన తల్లిలా కాకుండా బెస్ట్ మదర్ అవ్వాలనుకుంటుంది కానీ తనకు కూతురు పుట్టాకా కూతురే తనను ద్వేషించి దూరంగా వెళ్ళిపోతుంది అసలు ఎందుకలా జరిగింది? కెరీర్లో ఎంతో సాధించి, ఒక తల్లిగా శకుంతలా ఎందుకు ఓడిపోయింది అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
మ్యాథ్స్ జీనియస్ శకుంతలా దేవి జీవితాన్ని అద్భుతంగా చూపించిన సినిమా ఇది. చిన్నప్పుడు ఎంతో కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ను కూడా అలవోకగా ఆన్సర్స్ చెప్పే శకుంతల టాలెంట్ ను తన అన్న గుర్తించడం, చిన్నప్పుడే తను స్కూల్స్ కు వెళ్ళి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి టీచర్స్  షాక్ అయ్యేలా చేయడం, మా అమ్మాయిని కొంచెం కష్టమైన ప్రశ్నలే అడగండి అని తండ్రి టీచర్స్ ను అడగడంలాంటి సీన్స్ తో శకుంతల బాల మేధావి, ఆవిడకు ఆ టాలెంట్ సహజంగానే వచ్చింది అన్న విషయాన్ని బాగా చూపించారు.
అయితే అక్క చనిపోయాక కుటుంబాన్ని ద్వేషించి ఎలాగైనా గొప్ప దాన్ని అవ్వాలి అని లండన్ వెళ్ళిపోయిన శకుంతల తన షోస్ కోసం ప్రయత్నించడం ఒక ఆడది నిలబడి మ్యాథ్స్ ప్రొబ్లెంస్ సాల్వ్ చేస్తుంటే ఎవరు చూస్తారు అని అడిగిన వారిని పాటలు పాడడం, డాన్స్ చేయడం చూసిన వాళ్ళు నా షోస్ ఎందుకు చూడరు అని ఎదురు ప్రశ్నిస్తుంది చివరకి తను షోస్ చేయడానికి అవకాశం దొరకడంతో ఇక ఆమె వరల్డ్ వైడ్ గా పాపులర్ అవుతుంది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కేవలం సెకండ్స్ లలో చెప్పడం అది కూడా రైట్ టు లెఫ్ట్ చెప్పాలా లేక లెఫ్ట్ టు రైట్ చెప్పాలా అని అడగడం, కంప్యూటర్ అడిగిన క్వశ్చన్ రాంగ్ అని ప్రూవ్ చేయడం తను లైఫ్ లో గొప్పగా ఎదగడం వంటి సీన్స్, సాంగ్స్ తో సినిమా మొదటి గంట పరుగులు పెడుతుంది.
లైఫ్ లో ఫ్యామిలీని, తన ఆనందాలని వదిలేసి కేవలం డబ్బు కోసం, పేరు కోసం పరుగులు పెట్టి అవి సంపాదించిన తర్వాత శకుంతలకు తనకో తోడు కావాలనిపిస్తుంది అప్పుడు కలెక్టర్ గా వర్క్ చేస్తున్న పరితోష్ బెనర్జీ పరిచయమవుతాడు తనేమో ఒక దగ్గర ఉండలేదు ప్రపంచమంతా తిరాగాలనుకుంటుంది కానీ అతను ఆమెకు పూర్తిగా డిఫరెంట్ కలకత్తాలోనే ఉండాలనుకుంటాడు అపోజిట్స్ అట్రాక్స్ లా ఇద్దరూ కలుస్తారు. పరితోష్ ను పెళ్ళి చేసుకుని పాప పుట్టాకా కూతురు కోసం తను షోస్ చేయడం ఆపేస్తుంది అయితే తన లైఫ్ మ్యాథ్స్ నేను దాన్ని మిస్ అవుతున్నా అనడంతో భర్త కూతుర్ని నేను చూసుకుంటాను అంటాడు శకుంతల మళ్ళీ వరల్డ్ వైడ్ గా షోస్ చేయడం మొదలు పెడుతుంది. అయితే ఒకసారి తన కూతురు మొదట మాట్లాడిన మాట నాన్న అని భర్త చెప్పడంతో తన తల్లి మనసు దాన్ని తట్టుకోలేక తిరిగి భర్త దగ్గరికి వచ్చి తన కూతురు తనతోనే ఉండాలని పాపను తీసుకుని భర్తకు దూరంగా వెళ్ళిపోతుంది.
తనేప్పుడు షోస్ అని మ్యాథ్స్ అని తిరగడం తనని నెగ్లెక్ట్ చేయడం కూతురు అనుపమకు నచ్చదు దాంతో కూతురు తనతో కలిసే ఉన్నా తండ్రి గురించి ఆలోచించడం అతనికి లెటర్స్ రాయడం చేస్తుంది అది గుర్తించిన శకుంతల తండ్రి దగ్గరి నుంచే వచ్చే లెటర్స్ ఏవీ అనుపమకు ఇవ్వదు. చివరికి ఒక పార్టీలో అజయ్ పరిచయమయ్యాకా అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుని తానేప్పటికీ తల్లితో ఉండలేనని ఆమెకు దూరంగా వెళ్ళిపోతుంది. కూతురు దూరం అవడంతో తల్లిగా శకుంతల తను చేసిన తప్పు తెలుసుకుని తన సొంత ఇంటికి వచ్చి ఆ ఇంట్లో తల్లి దాచుకున్న తన పాత జ్ఞాపకాలు చూసుకుని ఒక్కసారిగా అమ్మా అంటూ ఏడవడం తన తప్పు తెలుసుకుని ఆస్థిoతా కూతురు పేరు మీద రాయడంతో మళ్ళీ తల్లికూతుల్లిద్దరు కలుస్తారు.
శకుంతల గా విద్యా బాలన్ నటన అద్భుతంగా ఉంది తన మేకోవర్, స్క్రీన్ ప్రేసేన్స్, డైలాగ్స్ చెప్పే విధానం అన్నీ అద్భుతంగా చేసింది. తల్లిని ద్వేషించే కూతురుగా, కూతురు విషయంలో ఫెయిల్ అయిన తల్లిగా ఆవిడ నటన సింప్లీ సూపర్బ్ నేనెప్పటికీ ఓడిపోను అని తను చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలించింది. ఇక ఆమె భర్తగా చేసిన బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా తన పాత్రలో మెప్పించాడు. శకుంతల కూతురుగా చేసిన సాన్యా మల్హోత్రా ది గ్రేట్ మ్యాథ్స్ జీనియస్ కూతురు అయినా తల్లి ప్రేమను పొందలేకపోవడం ఆ తర్వాత తల్లికే దూరంగా వెళ్లి బతకడం, తానేప్పటికీ తల్లి అవకూడదనుకువడం ఇలా తన పాత్రకు ఎన్నో వేరియేశన్స్ ఉన్నాయి తన పాత్రకు ఆవిడ పూర్తి న్యాయం చేసింది. శకుంతల కూతురు భర్తగా చేసిన అమిత్ సాద్ నటన బాగుంది, శకుంతల తండ్రిగా చేసిన ప్రకాష్ బేలవాడి, లండన్ లో తార బాయ్ పాత్ర చేసిన శీబా చద్ద తమ పాత్రలకు న్యాయం చేసారు. డైరెక్టర్ అను మీనన్ పాత్రల్ని డీల్ చేసిన విధానం ఆవిడ దర్శకత్వం, విజువల్ సెన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. డైలాగ్స్ పరంగా శకుంతల “నేనెప్పటికీ ఓడిపోను, మా ఇండియన్స్ అంతే కేవలం డ్రామా డ్రామా, నాకు భర్త అవసరం లేదు కూతురు కావాలి” అన్న డైలాగ్స్ బాగున్నాయి.   సినిమా విజువల్ గా చాలా రిచ్ గా ఉంది కెమెరా పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. సచిన్ జిగర్ పాటలు పర్వాలేదనిపిస్తాయి, కరణ్ కులకర్ణి నేపథ్య సంగీతం సినిమాకు తగినట్టు సాగింది. ప్రొడక్షన్ వాల్యుస్ బాగున్నాయి నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చాలా రిచ్ గా సినిమా నిర్మించారు.                  

మిస్ ఫైర్ కథనం :
శకుంతలా దేవి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆవిడ లైఫ్ స్టొరీలో కన్న కూతురే తన మీద కేసు వేసి ఆవిడ మీద కోర్ట్ లో పోరాడింది అన్న పాయింట్ అందరినీ హుక్ చేసింది ఎందుకలా జరిగింది మ్యాథ్స్ జీనియస్ వరల్డ్ ఫేమస్ శకుంతల కూతురు విషయంలో ఎం తప్పు చేసింది అన్న పాయింట్ ఆసక్తి రేకెత్తించింది. అయితే సినిమాలో ఈ పాయింట్ సరిగా చూపించలేకపోయారు తనకు తల్లి ప్రేమ దక్కకపోవడంతో తనెలా తల్లిని ద్వేశించిందో అదే తప్పు శకుంతల తన కూతురు విషయంలో చేస్తుంది అందుకే కూతురు దూరం అవుతుంది అయితే ఈ విషయాన్ని స్ట్రెయిట్ గా స్ట్రైకింగ్ గా చెప్పి శకుంతల కూతురు మధ్య కథను నడిపినట్టయితే ఎమోషన్స్ బాగా పండే చాన్సే ఉండేది కానీ సినిమా మొత్తం ప్యారలల్ గా అటు శకుంతల ఇటూ కూతురు లైఫ్ లో ఏం జరిగింది అన్నది చూపిస్తూ రావడంతో ఏ ఒక్కరితో కూడా మనం సరిగ్గా కనెక్ట్ అవలేకపోతాం. తల్లి ప్రేమకు దూరమై తానేప్పటికీ తల్లి అవకూడదు అని శకుంతల కూతురు అనుపమ నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత తల్లి అవడం వీటిలో ఆ పెయిన్, సోల్ మిస్ అయ్యాయి. తల్లిలా కాకుండా సొంతంగా హౌసింగ్ బిజినెస్ చేసిన కూతురును డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసిన శకుంతల చివరలో లండన్ లో కూతురు ఆస్తులన్నీ అమ్మేసిందని దాని టాక్స్ కట్టాలంటే మన ఆస్థులన్నీ అమ్మాలని భర్త చెప్పడం దాంతో కూతురే శకుంతల మీద కేసు వేయడం ఇదంతా అసలు విషయాన్ని దాచిపెట్టి ఏదో డ్రామా కోసం రన్ చేయడం సరిగ్గా సెట్ అవలేదు. నిజంగా శకుంతలా దేవి ఆవిడ కూతురు మధ్య కోర్ట్ కు వెళ్ళేంతగా ఎం జరిగిందన్న ఇంట్రెస్ట్ తో సినిమా చూసే ప్రేక్షకుడు చివరకు వచ్చేసరికి డిజప్పాయింట్ అవుతాడు.
చివరగా :
మ్యాథ్స్ జీనియస్ శకుంతల దేవి లైఫ్ ను పరిపూర్ణంగా చూపించనప్పటికీ ఆవిడ లైఫ్ లో ఎలా ఎదిగింది ప్రపంచాన్నే తన అమేజింగ్ టాలెంట్ తో ఎలా అబ్బుర పరిచింది అన్న విషయాల్ని అద్భుతంగా చూపించారు. ఒక ఆడది లైఫ్ లో ఎంత పెద్ద సక్సెస్ సాధించినప్పటికీ తల్లిగా ఫెయిల్ అవ్వడం అన్నది ఆమె తట్టుకోలేదు అన్న విషయాన్ని ఇంకాస్తా బెటర్ గా చెప్పుంటే శకుంతల తన కెరీర్లో అంత గొప్ప సక్సెస్ అయినప్పటికీ ఒక మహిళగా, ఒక తల్లిగా దేన్నీ మిస్ అయ్యింది అన్న పాయింట్ ఇంకా బాగా జనాలకు రీచ్ అయ్యేది. ఒక ఆడపిల్ల తన జీవితంలో అక్కగా చెల్లిగా భార్యగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది కానీ తన జీవితం పరిపూర్ణం అయ్యేది తనకు కంప్లీట్ సాటిస్ ఫ్యాక్షన్ దొరికేది కేవలం తను తల్లి అయినప్పుడే తన పిల్లలను బాగా చూసుకుని వాళ్ళ ప్రేమను గెలుచుకున్నప్పుడే అన్న విషయాన్ని శకుంతల దేవి జీవితాన్ని చూసి తెలుసుకోవచ్చు.       
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

One thought on “శకుంతలా దేవి హిందీ మూవీ రివ్యూ విద్యా బాలన్ షో!!!

Leave a Reply

Next Post

రాత్ అఖేలి హై హిందీ సినిమా రివ్యూ పర్వాలేదనిపించే క్రైమ్ థ్రిల్లర్

Fri Jul 31 , 2020
రాత్ అఖేలి హై హిందీ సినిమా రివ్యూ పర్వాలేదనిపించే క్రైమ్ థ్రిల్లర్ రాత్ అఖేలి హై హిందీ మూవీ రేటింగ్  3/5 నవజుద్దిన్ సిద్దికి ప్రధాన పాత్రలో వచ్చిన హిందీ చిత్రం రాత్ అఖేలి హై ఈరోజు డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఒక ఇంట్లో మర్డర్ జరగడం, అది చేసిందెవరు అన్న పాయింట్ మీద ఇది వరకు చాలానే సినిమాలు వచ్చాయి రీసెంట్ గా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: