శ్రీదేవి మామ్ సినిమా చైనా లో విడుదల


లెజెండరీ నటి శ్రీదేవి నటించిన సినిమా మామ్ హిందీ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దీనిలో నటనకు గాను శ్రీదేవి గారికి వుత్తమ నటిగా నేషనల్ అవార్డు లభించింది. మామ్ తో శ్రీదేవి నటిగా 300 సినిమాలు పూర్తి చేసుకుంది. ఆవిడ 50 ఏళ్ళ కెరీర్ లో ఇదొక మరపు రాని చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం చైనాలో రిలీజ్ కాబోతుంది అవునూ ఈ మధ్య మన భారతీయ సినిమాకు అక్కడ మంచి గుర్తింపు లభిస్తుంది అమీర్ ఖాన్ సినిమాలు దంగల్ , సిక్రే ట్ సూపర్ స్టార్ లాంటి సినిమాలకు అక్కడ వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ప్యాడ్ మ్యాన్ కూడా చైనా లో రిలీజ్ చేశారు. పోలాండ్, చెక్, రష్యా,అమెరికా,ఇంగ్లాండ్ లాంటి దేశాలతో పాటు మొత్తం 39 దేశాలలో ఈ సినిమాను రిలీజ్ చేసిన జీ స్టూడియో ఇంటర్నేషనల్ ఇప్పుడు మామ్ ని కూడా భారీ గా విడుదల చేయనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రహమాన్ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు గాను వుత్తమ సంగీత దర్శకు డిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. శ్రీదేవి గారి చివరి సినిమా కాబట్టి ఇది ఆమె అభిమానులకు ఒక చివరి జ్ఞాపకం అని అందుకే దీనిని చాలా పెద్ద లెవెల్ లో రిలీజ్ చేస్తున్నామని ఆమె భర్త ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత బోని కపూర్ చెప్పారు. 75 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించడం ఒక విశేషం.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అవసరాల దర్శకత్వంలో నాగ శౌర్య

Sat Mar 2 , 2019
నాగసౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒకటి మొదలు కానుంది. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ చిత్రాలలోని హీరో హీరోయిన్లు అలాగే దర్శకులు వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ చాలా ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడు అలా ఇంట్రస్ట్ ని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: