సంక్రాంతి విజేత F 2

సంక్రాంతి విజేత F 2!!

ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలో చాలా రసవత్తర పోటీ నడిచింది. ఓవైపు నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు మరోవైపు వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ F 2, ఇంకోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అయితే మొదటి నుంచీ చెబుతూ వస్తున్నట్టుగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కి గాని రామ్ చరణ్ వినయ విధేయ రామా సినిమా  గాని  బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు మొదటి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ రావడంతో ఆ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రామ్ చరణ్ వినయ విధేయ రామా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రామ్ చరణ్ కెరీర్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కానీ సినిమా గురించి మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ బయటకు రావడంతో రెండవ రోజు నుంచి కలెక్షన్లు కొంచెం మందగించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పెద్దగా సపోర్ట్ లభించకపోవడంతో మెల్లగా సినిమా కలెక్షన్లు డ్రాప్ అవడం జరిగింది.
అయితే ఈ రెండు సినిమాల తర్వాత జనవరి 12న రిలీజ్ అయిన F 2 సినిమాకు మాత్రం మొదటి ఆట నుంచే బ్రహ్మాండమైన టాక్ బయటకు రావడంతో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా సినిమా కథ కథనాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేవి కావడంతో సినిమా థియేటర్ల కి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ క్యూ కడుతున్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ అందరితో చూడొచ్చు అనే పేరు ఆల్రెడీ ఉంది ఈ సినిమాలో వెంకటేష్ నటన కూడా అద్భుతంగా ఉందని తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు అని టాక్ బయటకు స్ప్రెడ్ అయింది. అసలే పండగ వాతావరణం ఆపైన కాసేపు ఏదో సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే సగటు ప్రేక్షకుడి ఛాయిస్ F 2 సినిమా గా మిగిలింది. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వాళ్లకి అతి పెద్ద పండుగ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కానీ రామ్ చరణ్ వినయ్ విధేయ రామా ఈ రెండు సినిమాలు సగటు ప్రేక్షకుడికి కావాల్సిన వినోదాన్ని అందించడంలో పూర్తిగా విఫలం కావడంతో F 2 సినిమా ఆ లోటును భర్తీ చేస్తూ ప్రేక్షకులకు కొండంత వినోదాన్ని అందించగలిగింది. 
అయితే F 2 గురించి కూడా చాలా కంప్లైంట్ వచ్చాయి సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ సెకండాఫ్ లో లేదని కొంతమంది అయితే సినిమా ఫస్ట్ ఆఫ్ చూసి వచ్చేయ వచ్చని సెకండాఫ్ చూడాల్సిన అవసరం లేదని కూడా కామెంట్ చేశారు. వెంకీ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నాల నటన సినిమాల్లో ఉన్న మిగతా కమెడియన్స్ అందరు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో సెకండాఫ్ మీద ఉన్న కంప్లైంట్ కూడా మెల్లగా కవర్ అయిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద పండుగకు అయినా ఆడియన్స్ ఆదరించిన సినిమాల గురించి ఒక విశ్లేషణ అంటూ చేస్తే ఆ సినిమాలు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చినవే వుంటాయి. ఎందుకంటే సినిమా ఏమాత్రం బాగుందని తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్లు మినిమం 5 నుంచి 10 వరకు తెగుతాయి దాంతో ఒక హిట్టయిన సినిమాకు రిపీట్ ఆడియన్స్ ను ఓవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను మరో వైపు చూస్తే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణకు నోచుకున్న సినిమానే ఘన విజయం సాధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాలకి ఒక అద్భుతమైన అవకాశం సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చినా కలెక్షన్ల కుంభవృష్టి కురవడం ఖాయం. ఆ విధంగా చూస్తే ఈ సంక్రాంతికి ఈ జాక్పాట్ కొట్టింది నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పాలి. ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయ రామా లాంటి పెద్ద సినిమాల మధ్య తమ సినిమాను రిలీజ్ చేసి చాలా పెద్ద రిస్క్ చేసినందుకు ఇప్పుడు వాళ్ళు గొప్ప ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఈ సినిమాకి కాంపిటీషన్ అనుకున్న మిగతా రెండు సినిమాలు ఆడియన్స్ కు ఏమాత్రం రుచించక పోవడం తో F 2 పంట పండింది. గత సంవత్సరం వరుస వైఫల్యాలతో బాగా సఫర్ అయిన నిర్మాత దిల్ రాజు ఈ సంవత్సరం మొదటి లోనే F 2 తో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

అటు అమెరికా లో కూడా ఈ సినిమా కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయి ఇప్పటికే మిలియన్ మార్క్ దాటారు లాంగ్ రన్ లో ఖచ్చితంగా 2 మిలియన్ మార్క్ దాటుతుంది అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు కూడా చాలా సంవత్సరాల తర్వాత మంచి హిట్ పడిందనే చెప్పాలి. ఇటు జనవరిలో కానీ అటు ఫిబ్రవరిలో కానీ F 2 కు అంత గొప్ప పోటీ ఇచ్చే సినిమా ఏదీ లేదు కాబట్టి F 2 వరుణ్ తేజ్, వెంకటేష్ ల కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించినా సినిమా బడ్జెట్ కు డబుల్ రాబడి వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

పానిపట్ మూవీ ఫస్ట్ లుక్

Tue Jan 15 , 2019
పానిపట్ మూవీ ఫస్ట్ లుక్ పానిపట్ యుద్ధం గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ తీస్తున్న చిత్రం సంజయ్ దత్ అర్జున్ కపూర్ కృతిసనన్ ముఖ్య పాత్ర ల్లో  నటిస్తున్న ఈ చిత్రంలో పానిపట్ యుద్ధం ఎలా జరిగింది చరిత్ర తనలో దాచుకున్న సత్యాలేమిటి ఆ యుద్ధంలో జరిగిన మోసాలు కుట్రలు కుతంత్రాలు లాంటి విశేషాలతో ఈ సినిమాను అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్నారు. https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: