సమంత కొత్త సినిమా పేరేంటో తెలుసా??

అక్కినేని వారి కొత్త  కోడలు సమంత కొత్త సినిమా పేరేంటో తెలుసా??

అక్కినేని వారి కోడలు సమంత తన కెరీర్ లొనే టాప్ ఫామ్ లో ఉంది. రంగస్థలం హిట్ తర్వాత తనకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది అయితే ఈ అమ్మడు తాను అందరి హీరోయిన్ ల మాదిరిగా కమర్షియల్ సినిమాలే చేయకుండా తెలివిగా కెరీర్ లో ముందుకు వెళుతుంది అందుకు తాజా ఉదాహరణ యూ టర్న్ సినిమా. ఆ సినిమా పెద్ద లాభాలేం తీసుకురాకున్నా సమంత కు మాత్రం కొత్త గా ప్రయత్నిస్తుoది అన్న పేరు తీసుకొచ్చింది. 
ఆ మధ్య తమిళ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ ఎందుకో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల మీదే మనసు పారేసుకుంటుంది. కల్యాణ వైభోగమే ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది ఇది కూడా చాలా వెరైటీ సబ్జెక్ట్ ఒక 60 ఏళ్ళ ముసలావిడ మళ్ళీ ఇరవై ఏళ్ళ అమ్మాయిలా మారితే ఎలా ఉంటుంది ఏం జరిగింది అన్నదే ఆ సినిమా కథ దీన్ని తెలుగులో సమంత ఏరికోరి మరీ రీమేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు తెలుగులో “ఓ బేబీ ఎంత సక్కగున్నవే” అని ఖరారు చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఠాగూర్ కు సీక్వెల్??

Fri Dec 14 , 2018
ఠాగూర్ కు సీక్వెల్?? భరత్ అనే నేను సినిమా తరవాత మెగాస్టార్ చిరంజీవి తో తన నెక్స్ట్ సినిమా చేసే అదృష్టాన్ని దక్కించుకున్న టాప్ డైరెక్టర్ కొరటాల శివ ఆయనతో చేసే సినిమా మాములుగా ఉండకూడదు అని ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట అయితే కథ విషయంలో చిరంజీవి కి కొరటాల శివ కి కొంచం అసంతృప్తి ఉండడం తో ఠాగూర్  సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది అన్న […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: