సరిలేరు నీకెవ్వరు — ఓవర్సీస్‌లో దుమ్ములేపుతున్న మహేష్..

  సరిలేరు నీకెవ్వరు —    

ఓవర్సీస్‌లో దుమ్ములేపుతున్న మహేష్..

ఓవర్సీస్‌లో దుమ్ములేపుతున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు..
మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చిన మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి పండుగ సంరద్భంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరుగగా అంతటా దాదాపు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా యూఎస్‌ ప్రీమియర్స్ కూడా అదరగొడుతోంది. అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మహేష్ సరిలేరు నీకెవ్వరు అదిరిపోయిందని చెబుతున్నారు. 
Image
అయితే తాజా సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $ 620,000 లక్షలు వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ వసూళ్లు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రీమియర్ షోల ద్వారానే మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ వన్ మిలియన్ మార్క్‌ను దాటనుందని ట్రేడ్ వర్గాల సమాచారం. వరుస హిట్లతో ఊపు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని అన్ని వర్గాలను అలరించేలా తెరకెక్కించాడని అంటున్నారు. మహేష్‌కు జోడిగా రష్మిక మందన నటించిగా.. చాలా రోజుల తర్వాత కీలక పాత్రలో విజయ శాంతి నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, సంగీత, రావు రమేష్, బండ్ల గణేష్ అలరిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మించగా దిల్ రాజు సమర్పిస్తున్నారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

#BheeshmaTeaser Bheeshma Official Teaser - Nithiin, Rashmika Mandanna | Venky Kudumula

Sun Jan 12 , 2020
#BheeshmaTeaser Bheeshma Official Teaser – Nithiin, Rashmika Mandanna | Venky Kudumula CLICK ON IMAGE TO WATCH TRAILER https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: