సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్

సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్


సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ అంటే రొటీన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే వరసగా అరడజన్ ఫ్లాపులు ఇచ్చాడు ఈ కుర్ర హీరో. మెగా ఇమేజ్ ఉన్నా కూడా కొన్ని రొటీన్ కథలతో తన ఇమేజ్ తానే పాడు చేసుకున్నాడు. అలాంటి పరిస్థితి నుంచి చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి. అందులో ఫెయిల్యూర్స్ గురించి చెప్పాడు. అప్పటికి సాయి తేజ్ ఉన్న కెరీర్ గ్రాఫ్‌కు ఈ కథ 100 శాతం సరిపోయింది. దాంతో ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయారు. దానికితోడు చిత్రలహరితో ఓటమి గెలుపుకు తొలిమెట్టు అంటూ చూపించాడు ఈ హీరో. ఆ తర్వాత మొన్నొచ్చిన మారుతి ప్రతిరోజూ పండగే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
Prathiroju Pandage Raashi Khanna Poster - ChaiSamoSaa
ఈ చిత్రం సాయి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఏకంగా 35 కోట్లు షేర్ వసూలు చేసింది. నిర్మాతలకే కాదు బయ్యర్లకు కూడా లాభాల పంట పండించింది ప్రతిరోజూ పండగే. ఈ చిత్రంతో తన మార్కెట్ డబుల్ చేసుకున్నాడు సాయి. ఇక ఇప్పుడు కొత్త దర్శకడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ వచ్చేస్తున్నాడు ఈ హీరో. ఇందులో పెళ్లి అంటే దూరంగా వెళ్లిపోయే పాత్రలో నటిస్తున్నాడు. అమ్మాయిలంటే గౌరవం ఉన్నా కూడా పెళ్లి అంటే నో అనే పాత్ర ఇది. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేసిన ఈయన.. ఇప్పుడు యూత్ వైపు వెళ్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో కూడా సోలో సోదర సోదరీమణులారా అంటూ అదిరిపోయే స్లోగన్ తీసుకొచ్చాడు.
అదే సోలో బ్రతుకే సో బెటర్.. ఈ చిత్రం టీజర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మే 1న సినిమా విడుదల కానుంది. తనతో పాటు తన చుట్టూ ఉన్న కుర్రాళ్లను కూడా పెళ్లికి నో చెప్పేలా చేసే పాత్ర ఇది. ఇలాంటి కథ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. వాళ్లనే టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడు కూడా. ఈ రెండు సినిమాలతో పాటు దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. 
Image
ఇది హై రేంజ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. దేవా సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇప్పుడు సాయితో కూడా ఇలాంటి కథే చేస్తున్నాడు. మొత్తానికి మూసలోంచి బయటికి వచ్చి కొత్త కథలు చేసుకుంటూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు మెగా మేనల్లుడు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

#Brahmanandam No replacement found for dis King comedian 😊🙏🙏🙏

Sat Feb 1 , 2020
Happy birthday!! #Brahmanandam Can’t wait to see you and @SunnyLeone together on screen in upcoming Horror comedy #Kokakola film. We love you! https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: