సినిమా చూపించడం ఇంటి రూల్స్ ని ఉల్లంఘించడం కాదా ?

బిగ్ బాస్ అంటేనే ఫోన్, టీవీ, ఎవరితో సంభంధం లేని షో అని మనoదరికి తెలిసిందే. ఒక 14 లేదా 16 సెలబ్రిటీ లని ఒక ఇంట్లో ఉండి, వారికి టాస్క్ లు ఇవ్వడం, ఎవరు బాగా ఆడితే వాళ్ళని విజేతలుగా ప్రకటించడం చేస్తారు. మొదటి ఇది ఇంగ్లిష్ లో బిగ్ బ్రదర్ గా స్టార్ట్ అయ్యింది. ఆ కాన్సెప్ట్ నచ్చడంతో పలు బాషలలో కూడా ఇంట్రడ్యూస్ చేసారు.

బాగా సక్సెస్ అవ్వడంతో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం నాలుగవ సీజన్ నడుస్తుంది. ఈ సారి స్ట్రాంగ్ కoటెస్టెంట్ లు లేరని మొదట్లో అనిపించనా తర్వాత అందరు స్ట్రాంగ్ అయ్యి కూర్చున్నారు. ప్రస్తుతం ఇంట్లోకి జలజ అనే దయ్యం వచ్చింది అని అంటున్నారు. ఆమె టాస్క్ లు ఇవ్వడం చూసి బిగ్ బాస్ కoటెస్టెంట్ లు మేము చెయ్యము అన్నారు కానీ ఆ తర్వాత చేసారు. దీంట్లో భాగంగా దయ్యం జలజ వాళ్ళకి సినిమా చూపించడం, మాధలో ఒకర్నో, ఇద్దర్నో పిలిచి స్పూన్ వెతకమనడం అని చెప్పడం నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది.
సినిమా చూపించడం ఇంటి రూల్స్ ని ఉల్లంఘించడం కాదా ?

అయితే బిగ్ బాస్ ఇంట్లో సినిమా చూపించడం అనేది ఎంత వరకు కరెక్ట్ అని ప్రజలు మండి పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నా, లేదు ఇది ఒక టాస్క్ అని కొంతమంది అంటున్నారు. మరి కొంత మంది చూపించిన సినిమా పాతదే కదా, చూపించడం వళ్ళ ఏమి కాదని అంటున్నారు.