సినిమా రివ్యూ వినయ విధేయ రామ

రివ్యూ వినయ విధేయ రామ

రేటింగ్: 2.5/5 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు రిలీజ్ అయింది. రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

ఓ నలుగురు అనాధలు(తమిళ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, రవి వర్మ, మధునందన్) వాళ్లకు ఓ రోజు ఓ పసి బిడ్డ రామ్ చరణ్ కొణెదల (రామ్ చరణ్) దొరుకుతాడు. దాంతో వాళ్లంతా రామ్ ని అల్లారుముద్దుగా చూసుకుంటూంటారు. వాళ్లంతా చిన్నప్పటి నుంచీ సొంత అన్నదమ్ముల్లా పెరిగి పెద్దవుతారు. రామ్ కు తనను చేరదీసి పెంచి పెద్ద చేసిన అన్నయ్యలు అంటే ప్రాణం వాళ్లకు ఎప్పుడు ఎలాంటి హానీ జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో  పెద్దన్న  భువన్ కుమార్(ప్రశాంత్) ఐఎఎస్ అయ్యి ఎలక్షన్ కమిషనర్ గా జాబ్ చేస్తూంటాడు. ఏ ప్రాంతంలో అయినా  అవినీతి జరగకుండా ఎలక్షన్స్ జరిపించటంలో అతనికి మంచి పేరు ఉంటుంది. అయితే ఈ క్రమంలో పొలిటికల్ లీడర్స్ అందరికీ ఆయన ఒక శత్రువులా తయారవుతాడు.

అలాగే వైజాగ్ లోని పందెం పరుశురామ్ (మఖేష్ రుషి) కూడా భువన్ కుమార్ నిజాయితీ వల్ల, అతని తమ్ముడు రామ్ వల్ల చావు దెబ్బ తిని ఉంటాడు. దాంతో వాళ్ళు భువన్ కుమార్ ని,అతని ఫ్యామిలీని, రామ్ ని చంపేసేందుకు ప్లాన్ చేస్తాడు.  రామ్ మొత్తం ఫ్యామిలీని వాళ్ళు లేపేస్తారనగా… ఊహించని విదంగా బీహార్ సీఎం వచ్చి.. వాళ్ల నుంచి రామ్ ని, ఫ్యామిలీని సేవ్ చేస్తాడు. అప్పుడే అసలు రామ్ కు బీహార్ ముఖ్యమంత్రి కి ఏంటి సంబంధం ఫ్లాష్ బ్యాక్ లో రామ్ కు ఉన్న శత్రువు రాజు భాయ్ ఎవరు లాంటి వివరాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:

మాస్ డైరెక్టర్ బోయపాటి తో రాం చరణ్ సినిమా అనగానే మెగా అభిమానుల్లో అంచనాలు చాలా పెరిగి పోయాయి. అభిమానుల అంచనాలను నీటిని నిజం చేస్తున్న బోయపాటి రామ్ చరణ్ ను యాంగ్రీ యంగ్ మెన్ లా అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో చూపెట్టాడు. కానీ అసలు కథ  దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేసాడు. హీరో అన్న ఒక ఎలక్షన్ ఆఫీసర్ కావడం అతనికి బీహార్ లాంటి ఏరియా లో  డ్యూటీ పడడంతో అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న రాజు భాయ్ తో ఎలాంటి గొడవలు పడ్డాడు తద్వారా అతనికి శత్రువు అయ్యి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారు అన్నది సినిమా ప్రధాన కథ గా చెప్పుకోవాలి. అయితే ఈ చిన్న లైను తీసుకుని రెండు గంటల సినిమాగా తీయాలంటే దానికి చాలా కసరత్తు చేయాలి కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ టైమ్ పాస్ గా వెళ్ళిపోయినా ముఖ్యంగా సెకండాఫ్ తేలిపోయిందని చెప్పాలి.ఫస్టాఫ్ అంతా రామ్ చరణ్ తన ఫైట్లతో పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించినపటికి సెకండాఫ్ కి వచ్చేసరికి విషయం ఏమీ లేక పోవడంతో కథతో ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు.

భారీ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో చాలా మటుకు పాత్రలన్నీ ఏదో ఉన్నాయా అంటే ఉన్నట్లుగా ఉండటం చాలా వరకు దెబ్బ కొట్టింది. కేవలం రామ్ చరణ్ వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను తీర్చిదిద్దాలనుకున్నారు. అయితే  కథలో ఎలాంటి కొత్త దనం, ఇంట్రెస్ట్  లేకపోవడంతోపాటు చూస్తున్న  ప్రేక్షకుల కు ఇంట్రెస్ట్ కలిగించకపోవడంతో  సినిమా ఎప్పుడై పోద్ది రా బాబు అన్న ఫీల్ వచ్చేస్తుంది. సినిమాలో కనీసం  గుర్తు పెట్టుకో దగ్గ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ లేక పోవడం కూడా ఒక పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఇంటర్ బ్యాంక్ కొంత జోష్ ఇచ్చినప్పటికీ మళ్లీ సెకండాఫ్ లో సినిమా డల్ అవుతుంది. హీరోయిన్ గా చేసిన కైరా అద్వానీది కూడా అంత పెద్ద పాత్ర కాదని చెప్పాలి. ఫైట్ మాస్టర్ లు మాత్రం తమకు ఇచ్చిన  ఇచ్చిన అవకాశానికి పూర్తి న్యాయం చేశారు. కొన్ని సార్లు అభిమానులతో విజిల్స్ వేయించెలా ఫైట్స్ కంపోజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో పాటలు అంత వినసొంపుగా లేనప్పటికీ సినిమాలో అలా వెళ్లిపోతాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా దేవి అంత ప్రభావం చూపలేదని చెప్పాలి. కెమెరా వర్క్ మాత్రం కేక అనే చెప్పాలి, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, డివివి దానయ్య గారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

రామ్ చరణ్
కొన్ని యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

స్టోరీ
స్క్రీన్ ప్లే
సెకండ్ హాఫ్

ఫైనల్ రిజల్ట్:

డల్ రామ!!

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

స్వామి వివేకానంద భరతమాత ముద్దుబిడ్డ

Sat Jan 12 , 2019
స్వామి వివేకానంద భరతమాత ముద్దుబిడ్డ భారతదేశం అందించిన అద్భుతమైన వ్యక్తులలో స్వామి వివేకానంద ఒకరు. 1863 జనవరి 12 న జన్మించారు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా, రామకృష్ణ పరమ హంసకు ఈయన ప్రియ శిష్యుడు. తన అద్భుతమైన ఆలోచనలతో సందేశాలతో ఈ ప్రపంచాన్ని ఆయన సమ్మోహన పరచారు. యువతకు ఆయన ఇచ్చిన సందేశం ఇప్పటికీ వారిలో ఒక గొప్ప నమ్మకాన్ని నిలబెట్టే కలిగే శక్తి కలదు. తన జీవితమంతా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: