సిమ్రాన్ త్రిష హీరోయిన్లుగా తమిళ్ లో యాక్షన్ సినిమా

సిమ్రాన్ త్రిష హీరోయిన్లుగా తమిళ్ లో యాక్షన్ సినిమా

సిమ్రాన్ త్రిష ఇద్దరు కలిసి జంటగా నటించబోతున్నారు అది ఒక యాక్షన్ సినిమాలో నిజం ఇప్పుడు ఈ వార్త సినిమా వర్గాల్లో హాట్ టాపిక్. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన రజనీకాంత్ పేట చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు అయితే మళ్లీ ఇప్పుడు కేవలం వీరిద్దరితోనే యాక్షన్ సినిమాను తమిళ భాషలో తెరకెక్కించబోతున్నారు. అప్పట్లో సిమ్రాన్ తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలతో చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించారు కొన్ని రోజులపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిమ్రాన్ హవా నడిచింది. ఆ తర్వాత సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ అంతగా సినిమాలు ఏవి చేయకపోవడంతో ఈ మధ్యకాలంలో లైం లైట్లో లేకుండా పోయింది. అయితే మళ్లీ సెకండ్  ప్రారంభించి కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ రీసెంట్ గా రజినీకాంత్ పేట చిత్రంలో నటించడం ఆమె కెరీర్ కు మరొక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. 
ఇకపోతే త్రిష ఈ ముద్దుగుమ్మ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల పాటు తన హవాని కొనసాగించింది. అయితే ఆ తర్వాత కొత్త హీరోయిన్లు అందరూ రావడంతో త్రిష కెరీర్ లో కొంచెం వెనుకబడింది కింద తెలుగు సినిమా లలో త్రిష కు అవకాశాలు తగ్గిపోయాయి అయితే తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం త్రిష రెగ్యులర్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం తమిళ్ లో రిలీజ్ అయిన 96  తమిళ్ సినిమాతో త్రిషకు మళ్లీ మంచి క్రేజ్ వచ్చింది ఆ తర్వాత వెంటనే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో పేట అనే చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఇప్పుడు దర్శక నిర్మాతల కన్ను ఈ ఇద్దరు హీరోయిన్ల మీద పడింది అందుకే వీరిద్దరిని కలిపి ఒక యాక్షన్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ బ్యానర్ పతాకం పై సుమంత దర్శకుడిగా ఈ చిత్రం తెరెక్కబోతుంది ఈ సంవత్సరమే రిలీజ్ అవనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

మహేష్ బాబు మహర్షి మూవీ లొకేషన్ స్టిల్స్

Wed Feb 13 , 2019
మహేష్ బాబు మహర్షి మూవీ లొకేషన్ స్టిల్స్ https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: