సోనూ సూద్ మరో రికార్డు బాలీవుడ్ ఖాన్ లకు చెక్!!!

సోనుసూద్ కరోనాకు ముందు వరకు అతను సినిమాల్లో నటించే ఒక విలన్ మాత్రమే కానీ కరోనా మన దేశాన్ని భయపెడుతున్న వేళ సోనుసూద్ ఒక్కసారిగా పేద ప్రజలందరికీ తన వంతు సహయం చేసి సినిమా విలన్ కాస్త నిజ జీవితంలో హీరో అయి పోయాడు సోనుసూద్ పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మారు మోగిపోయింది. దాదాపు అన్ని వర్గాల ప్రజలు సెలబ్రిటీలు అటూ రాజకీయ నాయకులు కూడా సోనుసూద్ గొప్ప మనసును గెలుచుకున్నారు. అంతే కాదు తను చేసిన పనుల ద్వార సోనుసూద్ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఒక ఇన్స్పిరింగ్ గా నిలిచారు. ఆయన సమజా సేవకు మెచ్చి సోనుసూద్ ను ఇటీవల పంజాబ్ స్టేట్ ఐకాన్ గా నియమించింది.

అలాగే సోనుసూద్ ట్విట్టర్ ఫాలోయింగ్ కూడా బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లను దాటి ఎక్కువగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అయితే ప్రముఖ సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ (ట్విట్టీట్) వెల్లడించిన వివరాల ప్రకారం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ లో సోనూ సూద్ నంబర్ 1గా నిలిచారు.

ఈ సంస్థ అక్టోబర్ నెలలో తమ అనలిటిక్స్ నివేదికలో నాలుగో స్థానంలో సోనూ ఉన్నారని వెల్లడైంది. రాజకీయాలు- జర్నలిజం- వ్యాపారం- పెట్టుబడి- క్రీడలు- చలనచిత్రం- పుస్తక రచన- పాక కళ – కామెడీ రంగాలలోని ప్రముఖ వ్యక్తుల కోసం ట్విట్టర్ ఎంగేజ్ మెంట్లను ట్విట్టీట్ విశ్లేషించింది. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ తరువాత రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ, సోను సూద్ ఉన్నారు.అయితే దీంట్లో బాలీవుడ్ జాబితాలో 2.4 మిలియన్ ఎంగేజ్ మెంట్ లతో సోనూ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, వరసగా వంద కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే అక్షయ్ కుమార్, విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్, తెలుగులో బుట్టబొమ్మగా ఫేమస్ అయిన పూజా హెగ్డే ఉన్నారు.