హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు హీరోగా సినిమా ప్రారంభం


Aman Rakulpreeth Brothe
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా ఓ కొత్త సినిమా ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రాంభమైంది. ముహర్తం షాట్ కు రకుల్ ప్రీత్ క్లాప్ కొట్టగా మంచు లక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు మొదటి షాట్ కు హీరో సందీప్ కిషన్ అలాగే మరో హీరో కమ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఒక కొత్త హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాకి నాగ శౌర్య తో నీ జతలేక అనే సినిమా తీసిన దాసరి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక రొమంటిక్ లవ్ స్టోరీ గా రానున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కానుంది. తెలుగు లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా తో పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమా హిట్ అవడంతో తర్వాత మెల్లగా మీడియం హీరోల సరసన చేస్తూ చివరికి తెలుగులో పెద్ద హీరోల అందరి పక్కన హీరోయిన్ గా నటించింది. అటు తమిళ్ లో హీరో కార్తీ సరసన నటించిన సినిమాలు కూడా మాంచి హిట్ అయ్యాయి. అలాగే బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అక్కడ అంతగా విజయవంతం కాలేదు. మళ్ళీ తెలుగు లో సినిమాలు చేసి నప్పటికీ ఈ మధ్య పెద్దగా అవకాశాలు ఏం రావడం లేదు. బాలకృష్ణ తో సినిమాలో హీరోయిన్ గా బుక్ అయ్యింది అని న్యూస్ అయితే వచ్చింది కానీ ఇంకా కన్ఫర్మ్ అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇలా తమ్ముడిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఆల్ ది బెస్ట్ రకుల్.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కళ్యాణ్ రామ్ సినిమాకి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ లు!!

Sun Feb 24 , 2019
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ కెమెరా మెన్ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది దాని పేరు 118 ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యే పూర్తి చేసుకుంది. నివేద థామస్ షాలిని పాండే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ వేసవి కానుకగా విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రోజు ఫిల్మ్ నగర్ లోని జే ఆర్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: