హీరోయిన్ వేటలో రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలూ అనే చాలా మంది 
ఎదురుచూస్తుంటారు. అలియాభట్ లాంటి క్రేజీ, టాలెంటెడ్ హీరోయిన్లు అవకాశం ఇవ్వమని 

ప్రాధేయపడినట్టు ఇటీవల స్పష్టమైంది. అలాంటిది తాను కోరకముందే తన ముందుకు వచ్చిన ఆఫర్‌ను శ్రద్ధాకపూర్ ఎందుకు రిజెక్ట్ చేసిందనే చర్చ మొదలైంది. శ్రద్ధాకపూర్ రిజెక్ట్ చేయడం వెనుక కారణం సరైందనే మాట వినిపిస్తున్నది.
                                                 
ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR సినిమాకు సంబంధించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మరోసారి చుక్కెదురైంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి బ్రిటీష్ అందాల సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకొన్న తర్వాత మరో హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. శ్రద్ధాకపూర్, పరిణితి చోప్రాలాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధాకపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ సినిమా ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్టు వచ్చిన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.

సున్నితంగా తిరస్కరించిన శ్రద్ధా కపూర్ 


బాలీవుడ్‌లో అత్యంత బిజీగా మారిన హీరోయిన్లలో శ్రద్ధాకపూర్ ఒకరు. సాహో చిత్రం కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. పలు ప్రాజెక్టుల కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అయితే RRR సెన్సేషనల్ ప్రాజెక్ట్ కావడం, అందుకోసం భారీగా డేట్స్ కేటాయించి రావడం ఆమెకు సమస్యగా మారినట్టు తెలిసింది. అందుకోసమే రాజమౌళి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

హీరోయిన్ సీన్లు వచ్చే షెడ్యూల్‌కు RRR కథలో భాగంగా హీరోయిన్‌ది బ్రిటీష్ యువతి పాత్ర అని తెలిసింది. అందుకోసమే డైసీ ఎడ్గర్ జోన్స్‌ను రంగంలోకి దించారు. కానీ కుటుంబ కారణాలు చెప్పి ఈ సినిమాకు ముఖం చాటేసింది. విదేశీ యువతి దొరకని పక్షంలో కథలో మార్పులు చేసి ఇండియన్ హీరోయిన్‌కు అనుకూలంగా స్టోరిని మార్చే ప్రయత్నం చేస్తున్నారనే వార్త కూడా బయటకు వచ్చింది. అంతేకాకుండా ప్రస్తుత షెడ్యూల్‌లో హీరోయిన్ కన్ఫర్మ్ కాకపోతే వచ్చే షెడ్యూల్‌లో హీరోయిన్ పాత్రకు సంబంధించిన సీన్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

-కాంచన రీమేక్ బాలీవుడ్ కు రాఘవ లారెన్స్

Sun Apr 28 , 2019
కాంచన’ రీమేక్‌తో రాఘవ లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ.. ‘కాంచన‘ చిత్రాన్ని హిందీలో ‘లాక్ష్మీ బాంబ్‘ పేరుతో రూపొందిస్తున్నారు. ‘ప్రియమైన స్నేహితురాలా, అభిమానులారా.. ది గ్రేట్ అక్షయ్ కుమార్ హీరోగా కాంచన హిందీ రీమేక్ మొదలు పెట్టాను. నాకు మీ అందరి ఆశీర్వాదం కావాలి‘ అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంచన‘తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇపుడు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: