హీరో విశాల్ అరెస్ట్ ?

హీరో విశాల్ అరెస్ట్ ? 

తమిళ హీరో విశాల్ ని ఈరోజు మధ్యాహ్నం చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు , విశాల్ కు జరుగుతున్న గొడవల్లో భాగంగా సంఘటన చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు ఇళయరాజా గారితో ఒక ప్రోగ్రాం నిర్వహించాలనుకుంటున్న విశాల్ కు తమిళనాడు సినీ నిర్మాతల ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్న మిగతా సభ్యులకు ప్రోగ్రాం కు సంబంధించిన చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.


Image credit from hero Vishal official Twitter Account 
సందర్భంగా ఈరోజు ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్న మిగతా సభ్యులు అందరూ కౌన్సిల్ ఆఫీసుకు వచ్చి ఆఫీసుకు తాళం వేసుకుని వెళ్లడం జరిగింది. విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సినీ హీరో విశాల్ అక్కడ ఆఫీసుకు వెళ్లి ఆఫీస్ తాళం పగులగొట్టడానికి ప్రయత్నిoచారు. అయితే సమయంలో అక్కడికి పోలీసులు చేరుకొని ఆఫీస్ తాళాలు పగలగొడుతున్న విశాల్ ని అడ్డుకున్నారు, దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొంది. తాను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడుని అని తనను ఆఫీసు లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటారని పోలీసులతో విశాల్ వాగ్వాదానికి దిగారు, పోలీసులకు విశాల్ ఎంత నచ్చచెప్పాలని చూసినా కూడా పోలీసులు వినకుండా విశాల్ అక్కడినుంచి పంపించి వేయాలని చూశారు. సందర్భంగా కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు విశాల్ ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించి వేశారు.
తమిళ సినీ హీరో విశాల్ కెరీర్ లో మొదటి నుంచి చాలా కాంట్రవర్సీలు నడుస్తూనే ఉన్నాయి. హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో ప్రేమ వ్యవహారం గురించి హీరో శింబుతో జరిగిన గొడవలు గురించి కూడా చాలా వ్యవహరాలు ఇలానే వెలుగులోకి వచ్చాయి. అయితే తమిళ్ హీరో విశాల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గా పోటీ చేసినప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులకు చాలా గొడవలు జరిగాయి. అప్పుడు  వర్గానికి హీరో శరత్ కుమార్ కూడా బహిరంగంగానే మద్దతు తెలిపారు కానీ చివరికి జరిగిన ఎలక్షన్స్లో విశాల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇప్పుడు విశాల్ అరెస్టుతో గొడవలు ముదిరి పాకానపడ్డాయి ముందు ముందు తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఇంకేం జరుగుతుందో అని అక్కడ తమిళ సినీ అభిమానులు కలవరపడుతున్నారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

గెలుపు గుర్రాలు ఏవి ???

Thu Dec 20 , 2018
గెలుపు గుర్రాలు ఏవి??? ఈ శుక్రవారం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నాలుగు  సినిమాల మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే చివరికి బాక్సాఫీసు దగ్గర ఏ సినిమా విజేతగా నిలుస్తుందని చూడాలంటే మనం ఇంకొక్క 24 గంటల వరకు ఆగాల్సిందే. ఇక పోతే ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది  కే జీ ఎఫ్ అనే సినిమా గురించి. ఇది కన్నడ భాషలో నిర్మితమైన […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: