28 ఏళ్లకు ఆ ఘనత సాధించిన నటి కీర్తి సురేష్..

28 ఏళ్లకు ఆ ఘనత సాధించిన నటి కీర్తి సురేష్..

దాదాపు 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటి దక్కింది.  తెలుగు సినిమా ‘మహానటి‘లో కీర్తి సురేష్ నటనకు ఈ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమాకు ఈ గౌరవం  దక్కడం పట్ల సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ.. తమ సంతోషాన్ని కామెంట్స్ రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇది అలా ఉండగా.. 1990లలో తెలుగు చిత్రసీమ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ‘కర్తవ్యం’ చిత్రానికిగాను ఈ అవార్డ్ వరించింది. కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసిన విజయశాంతి నట జీవితం గురించి చెప్పుకుంటే ‘కర్తవ్యం’ ముందు తర్వాత అనేంతగా గొప్ప మలుపు తీసుకొందీ ఈ సినిమా.
తాజాగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డ్‌ల కోసం 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని సినిమాలను లెక్కలోకి తీసుకుని వీటిని ప్రకటించారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

బంగారంలా మెరిసిపోతోన్న కాజల్

Sat Aug 10 , 2019
బంగారంలా మెరిసిపోతోన్న కాజల్ https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: