96 మూవీ లో సమంత శర్వానంద్

96 మూవీ లో సమంత శర్వానంద్

96 తమిళ్ లో  విజయ్ సేతుపతి త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. రామ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథగా తమిళ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో సమంత శర్వానంద్ లతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు తమిళ దర్శకుడు రామ్ కుమార్ తెలుగు కు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. తమిళ్ లో ఈ సినిమా రిలీజైన రోజు నుంచి మంచి టాక్ ను సంపాదించుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్రకు అక్కడ లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు తన కెరీర్లోనే అత్యుత్తమ పాత్ర ఇది అని అక్కడ తమిళ సినీ వర్గాలు వ్యాఖ్యానించాయి. 
ఈ సినిమాను ముందుగా తెలుగులో నాని సమంతల తో రీమేక్ చేద్దామని భావించారు ఆ తర్వాత మధ్యలో అల్లు అర్జున్ నితిన్ శర్వానంద్ వీరి ఇద్దరి పేర్లు కూడా వినిపించాయి.  చివరకు శర్వానంద్ వైపే మొగ్గు చూపడంతో దిల్ రాజు ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. మన తెలుగువాళ్ళకి రీమేకుల మీద మోజు ఎక్కువ ఉంటుంది అందులో అక్కడ సూపర్ హిట్టు మంచి టాక్ తెచ్చుకున్న చిత్రం ఉంటే కచ్చితంగా దాన్ని  మనసు పడి మరీ భారీ ధరలకు అయినా కొంటుంటారు. అయితే తమిళ మాతృక లో ఉన్న కథకు తెలుగులో మరి కొన్ని మార్పు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. తమిళ సినిమాలో హీరో ఒక ఫోటోగ్రాఫర్ కొన్ని సంవత్సరాల తర్వాత తన పాత స్నేహితులను కలవడం ద్వారా సినిమా కథ ప్రారంభమవుతుంది టీనేజిలో తను ప్రేమించిన ఒక అమ్మాయిని మళ్లీ కొన్నేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నప్పుడు ఒక యువకుడి భావాలు ఏ విధంగా ఉన్నాయి అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది స్థూలంగా ఈ సినిమా కథ. మంచి భావోద్వేగాలు ఎమోషన్ సెంటిమెంట్ ఉన్న ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే సన్నివేశాలు తమిళ ప్రేక్షకులను కట్టిపడేశాయి దర్శకుడు చాలా సహజంగా సన్నివేశాలను రాసుకోవడంతో ఇది నిజంగా మన జీవితంలో జరిగిన కథ లేదా మన జీవితంలో ఇలా జరిగితే బాగుంటుంది కదా అన్న ఆలోచన ప్రేక్షకులకు కచ్చితంగా వస్తుంది .
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఎన్టీఆర్ మళ్లీ అదే పని చేస్తున్నాడు గా!!

Sat Jan 26 , 2019
ఎన్టీఆర్ మళ్లీ అదే పని చేస్తున్నాడు గా!! ఎన్టీఆర్ తెలుగులో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మంచి నటుడు. అద్భుతమైన విజయాలతో తన కెరీర్ లోనే చాలా గొప్ప స్థాయికి చేరుకున్న ఈ హీరో ఆ మధ్య టెలివిజన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు బిగ్ బాస్  తెలుగు మొదటి సీజన్ ను పోస్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ ఈ ఫీట్ సాధించారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: