96 సినిమా రీమేక్ టైటిల్ అదేనా??


విజయ్ సేతుపతి త్రిష హీరో హీరోయిన్లు గా తమిళ్ లో రిలీజ్ అయ్యి మాంచి క్లాస్ మూవీగా పేరు తెచ్చుకున్న 96 సినిమా రీమేక్ తెలుగు లో దిల్ రాజు నిర్మాతగా శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం మొదలు అవడానికి అంతా సిద్దం అయింది. అయితే 96 అని కాకుండా ఈ రీమేక్ కు ఏదైనా తెలుగు పేరు పెట్టాలన్నది నిర్మాత దిల్ రాజు ఆలోచన. ఇప్పుడు ఆ టైటిల్ కూడా ఫైనల్ అయింది అదే జాను అలియాస్ జానకీదేవి. నిజానికి ఈ పేరు సినిమాలో హీరోయిన్ పేరు ఇప్పుడు ఇదే టైటిల్ గా పెట్టాలనుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది సినిమా టైటిల్ జాను అని పెడతారా? లేదా జాను అలియాస్ జానకీ దేవి అని టైటిల్ పెడతారా? అన్నది ఇంకా డిస్కషన్ లో వుంది అని తెలుస్తుంది. ఒకవేళ జాను అనిపెడితే చాలా సింపుల్ అండ్ స్వీట్ గా అలాగే షార్ట్ గా క్యాచి గా బాగుంటుంది. అదే దానికి మళ్లీ అలియాస్ జానకి అని కలిపితే అంత బాగుండదు అని టాక్ వినిపిస్తోం దంట అందుకే టైటిల్ మీద ఇంకా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేక పోతున్నారంట. ఇంత చిన్న సమస్యకు అంత గాభరా పడుతున్నారంటే అనుకోవచ్చు మిగతా వాళ్ళు కానే ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి రాజు గారికి అడ్డుగా ఉందని టాక్ వినిపిస్తుంది అదేంటంటే జాను అని టైటిల్ పెడితే గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా జాని కి దగ్గరగా ఉందని అదెలాగో ఫ్లాప్ అయ్యింది కాబట్టి మీ సినిమాల కూడా ఫ్లాప్ అని గట్రోల్ చేస్తారేమో అని అనుమానం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్స్ యే కాకుండా 99 అనే మరో టైటిల్ ను కూడా ఆప్షన్ లో వుంచుకున్నారు. మరి దీంట్లో ఏదో ఒకటి ఫైనల్ అయ్యి అన్నీ సెట్ అయితే హీరో శర్వా నంద్ పుట్టినరోజున లేకపోతే సినిమా ఓపెనింగ్ అప్పుడు కానీ అనౌన్స్ చేద్ధాం అనుకుంటున్నారట.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అటు మహేష్ బాబు ఇటు అల్లు అర్జున్ మధ్యలో సుకుమార్!!!

Mon Mar 4 , 2019
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇటు హారిక హాసిని బ్యానర్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎలా కంటిన్యూ గా సినిమా లు చేస్తుంటా డో, ఇటు మైత్రీ మూవీస్ బ్యానర్ కు సుకుమార్ అలా కంటిన్యూ గా చేస్తుంటారు. అయితే సినిమా ఎప్పుడు చేసినా సరే, సుకుమార్ ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి మైత్రి మూవీస్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా చేయడమే మైత్రీ మూవీస్ వారికి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: