అవినాష్ అలా చేసి బిగ్ బాస్ టైటిల్ కొట్టేద్దామనుకుంటున్నాడా ?

Avinash

మాస్ అవినాష్ లేదా జబర్దస్త్ అవినాష్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మంచి ఎంటర్టైనర్ అని మనందరికీ తెలిసిందే… అయితే రేస్ టు ఫినాలే లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే, ఆవు అంబా అనగానే పాలు పాతుకోవాల్సి ఉంటుంది, ఎవరి దగ్గర ఎక్కువ బాటిల్స్ ఉంటె వాళ్ళు సెకండ్ రౌండ్ కి వెళ్తారు అని చెప్పడం జరిగింది. అయితే ఆ టాస్క్ లో భాగంగా అవినాష్ కూడా పాలు పట్టడానికి వెళ్ళాడు. ఆ టాస్క్ మధ్యలో అవినాష్ సోహెల్, అఖిల్ లతో గొడవపడ్డాడు. సోహెల్ నా క్యాన్ కి హోల్ పడింది అని అంటే అవినాష్ మీరు అందరు ఒకటై నన్ను ఒక్కడిని చేసారు అంటూ గొడవకి వచ్చాడు.

అవినాష్ అలా చేసి బిగ్ బాస్ టైటిల్ కొట్టేద్దామనుకుంటున్నాడా ?

Image

అయితే హీరో నాని బిగ్ బాస్ 2 ని హోస్ట్ చేసినప్పుడు కౌశల్ గెలిచిన విషయం తెలిసిందే… అప్పుడు ఇంటి సభ్యులు అందరు కలిసి కౌశల్ మీద గొడవకి రావడంతో తానొక్కడే ఒంటరి పోరాటం చెయ్యాల్సి వచ్చింది. ప్రేక్షకులు ఇది గమనించి కౌశల్ ని గెలిపించారు. అయితే ఇప్పుడు అవినాష్ కూడా అలానే చేసి గెలుద్దాం అనుకుంటున్నాడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత అవినాష్ మళ్ళి ఆ టాపిక్ ని తియ్యలేదు. ఆ టాస్క్ నుండి అవినాష్ స్వయంగా తప్పుకున్నాడు అప్పుడు సోహెల్ అతని దగ్గరకి వచ్చి గేమ్ గేమ్ లా ఆడాలి అని నువ్వే అంటావు కదా ఇప్పుడు ఆడు అని మండలిన్చినా కూడా ఆడలేదు. ఆ తర్వాత తన బాటిల్స్ అందరికన్నా ఎక్కువ ఉండే సరికి అఖిల్ కి అనుమానం వచ్చి, నీళ్ళు కలిపాడు అని బిగ్ బాస్ కి చెప్పాడు. అప్పుడు అవినాష్ అది నా గేమ్, బిగ్ బాస్ ఏదైనా చెయ్యొచ్చు అన్నాడు, అని చెప్పాడు. అప్పుడు బిగ్ బాస్ నేను కేవలం ఆవు నుండి వచ్చే పాలు మాత్రమె బాటిల్స్ లో నింపాలి, అని అనడంతో అవినాష్ ఆ టాస్క్ నుండి తప్పుకున్నాడు ఆ తర్వాత అరియానా, మోనాల్ లు కూడా తప్పుకున్నారు.

సో అవినాష్ సడన్ గా అలా అనే సరికి కౌశల్ లా చేద్దాం అనుకున్నాడని ప్రేక్షకులు తేల్చి చెప్పారు….

Leave a Reply