బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్ లీడర్ పాత్రలో అల్లు అర్జున్

బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్ లీడర్ పాత్రలో ఆలు అర్జున్

అల వైకుంఠ పురం లో సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి నాన్ బాహుబలి రికార్డులు అన్నిటినీ తిరగరాసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాగే
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్లో దాదాపు 20 సినిమాలు హీరోగా చేసిన అల్లు అర్జున్ మంచి హిట్ లు సాధించి స్టైలిష్ స్టార్ గా యూత్ లో బాగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు బన్నీ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ కొత్త సినిమాను ప్ అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. అల వైకుంఠ పురం లో సినిమా తర్వాత వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన శాండీ – స్వాతి – నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు.అయితే కొరటాల శివ సినిమాలు అంటేనే సామాజిక ఇతివృత్తం తో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సినిమా కూడా సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సినిమా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా ఒక కొత్త న్యూస్ ఏంటంటే బన్నీ – కొరటాల కాంబోలో రాబోతున్న సినిమా పొలిటికల్ నేపథ్యానికి సంబంధించినది అనే ఒక న్యూస్ సినిమా సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతోంది.

Image

బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్ లీడర్ పాత్రలో అల్లు అర్జున్

ఇప్పటికే ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి నీ చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు కొరటాల శివ మరి ఆయన ఇప్పుడు
అల్లు అర్జున్ ను కూడా తన నెక్స్ట్ సినిమాలో పొలిటికల్ లీడర్ గా చూపించనున్నాడట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో బన్నీ నటించిన ‘రేసు గుర్రం’ సినిమా పాలిటిక్స్ బేసేడ్ మూవీ అయినప్పటికీ కూడా అందులో అతను పొలిటికల్ లీడర్ గా నటించలేదు పోలీస్ గా కొన్ని సీన్స్ లో నటించాడు. కానీ ఇప్పుడు కొరటాల సినిమాలో మాత్రం మొదటి సారిగా పక్కా పొలిటికల్ లీడర్ గా బన్నీ నటిస్తున్నాడట. ఈ సినిమా కథ మొత్తం కూడా దాదాపు స్టూడెంట్ పాలిటిక్స్ – పేదరికం – నిరక్షరాస్యత.. ఇలాంటి చాలా ముఖ్యమైన సామాజిక సమస్యల చుట్టూనే తిరుగుతుందని టాక్ బాగా ఎక్కువగా నడుస్తోంది.

pushpa

అయితే ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఈ చిత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోందని హింట్ మేకర్స్ ఇచ్చారు.ఒకవేళ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా బన్నీ కొరటాల శివ సినిమాలో కనిపించేది నిజమే అయితే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో ఆయన్ని చూడాలి అనుకునే ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు కొరటాల శివ స్టైల్ లో సామాజిక అంశాలతో వచ్చిన కూడా డా ఇందులో అల్లు అర్జున్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అతని స్టైలిష్ డాన్స్ స్టెప్స్ కూడా ఉంటాయని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ చేస్తున్న ‘ఆచార్య’ సినిమా పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు పెడుతారు అని తెలుస్తుంది. ఇక అటు బన్నీ ‘పుష్ప’ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ సినిమా కి వస్తాడు అని ఆ సినిమా వర్గాలు అంటున్నాయి.

Leave a Reply