BB: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా…?

బిగ్ బాస్ చివరి దశలో అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. గత వారం అవినాష్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడంతో సేవ్ అయిన విషయం తెలిసిందే… ఆ రోజు అవినాష్ చాల ఎమోషనల్ అయ్యి నేను ఎలిమినేట్ అయ్యాను సర్, అని తికమకగా మాట్లాడాడు. అయితే నిన్న రేస్ టు ఫినాలే మెడల్ అఖిల్ సొంతం అయ్యింది కాని బిగ్ బాస్ చెప్పేంత వరకు దాన్ని ముట్టుకోవద్దు అని అన్నారు. అలాగే ఈ వారం మీరు గనక సేవ్ అయితే డైరెక్ట్ గా ఫినాలే వీక్ లోకి అడుగుపెడతారు అని అఖిల్ కి చెప్పుకొచ్చారు.

నాగార్జున అవినాష్ కి, మోనాల్ కి తక్కువ ఓట్లు వస్తున్నాయని గత రెండు వారాలుగా చెప్తూనే వస్తున్నారు. అయితే మోనాల్ తో పోలిస్తే అవినాష్ నామినేషన్స్ లో ఉన్నది చాలా తక్కువ. తను నామినేషన్స్ లో ఉన్న ప్రతి శని, ఆదివారాలు నాగార్జున అవినాష్ కి, తక్కువ ఓట్లు వస్తున్నాయని హెచ్చరించారు. అయితే ఈ వారం కూడా అవినాష్ కి తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. దాని ప్రకారం చూస్తె ఈ వారo అవినాష్ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది. ఒక దశలో హారిక అభిజీత్ ని నామినేట్ చేసింది కాబట్టి తను ఎలిమినేట్ అవుతుందని, మరొక దశలో మోనాల్ అసలు ఏమి ఆడడం లేదు అని, తననే ఎలిమినేట్ చేస్తారని అనిపించింది. కాని ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అవినాష్ అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ ఎటువంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాల్సిందే…