F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఉత్తరం రాసిన అభిమాని

F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఉత్తరం రాసిన అభిమాని

F2 సినిమాతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి కి ఒక అభిమాని ఆయన సినిమా గురించి లెటర్ రాశారు సెల్ ఫోన్లు ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక దర్శకుడికి అభిమాని లెటర్ రాయడం అంటే అది గొప్ప విషయమని చెప్పుకోవాలి ఇలా తనకు ఒక అభిమాని ఉత్తరం రాసిన విషయాన్ని అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నెల్లూరు లోని బాలాజీ నగర్ లో ఉండే కొలపల్లి ఈశ్వర్ ఎఫ్ 2 సినిమా చూసి అది బాగా నచ్చడంతో ఏదైనా కొత్త పద్ధతి లో తనకు సినిమా నచ్చిన విధానాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కి చెప్పాలని ఒక రోజు ఆంధ్ర జ్యోతి పేపర్ లో వచ్చిన అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చూసి దానిలో ఆయన ఇంటి అడ్రస్ కనుక్కుని ఈ లెటర్ రాశారు అది నిజంగానే అనిల్ రావిపూడి కి అందడంతో ఆయన చాలా సంతోష పడి ఈశ్వర్ కు థాంక్స్ చెపుతూ ట్విట్టర్ లో తనకు వచ్చిన లెటర్ ఫొటోస్ ను షేర్ చేశారు. ఇక ఎఫ్ 2 సినిమా విషయానికి వస్టే సంక్రాంతి కానుకగా విడుదల అయి అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది దాదాపుగా 100 కోట్ల గ్రాస్ కూడా రాబట్టిన ఈ సినిమా ఈ సంవత్సరం అటు నిర్మాత దిల్ రాజు కు ఇటు దర్శకుడు అనిల్ రావిపూడి కి అలాగే హీరో వెంకటేష కు మంచి విజయాన్ని అందించింది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

చంద్రబాబు ఆవేశానికి అసలు కారణం అదేనా??

Sun Feb 3 , 2019
చంద్రబాబు ఆవేశానికి అసలు కారణం అదేనా?? ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  గారికి ఈమధ్య ఎక్కడలేని ఆవేశం వస్తుంది మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీద ఆయన చూపించిన ఆవేశం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏప్పుడు సైలెంట్ గా సీరియస్ గా ఉండే చంద్రబాబు నాయుడు ఇంత ఆవేశానికి లోను అవడం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్ చేశారు. […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: