F2 movie Review (FULL FUN)

ఈ సరదా తోడు అల్లుళ్లే సంక్రాంతి విజేత లు  
F2 movie  Review (FULL FUN)


తెలుగు పండగకు అదీ సంక్రాంతి పండగకు ఎలాంటి రుచికరమైన వంట చేయాలో దిల్ రాజు కు బాగా వొంటబట్టిందండోయ్

మీద నుండి అనిల్ రావిపూడి ఒకడు , నాకు కనపడదు సర్ అంటూనే మనం కళ్ళు మూసి తెరిచేలోపు సినిమాను హిట్ అనిపించేస్తాడు

వంట వండేవాడు ఉంటే సరిపోదు కదా , వంట ఎలా చేయించాలో తెలిసినోడు కూడా ఉండాలి, అతనే దిల్ రాజు

ఛలో ఒక లుక్కేద్దాం అసలు F2 సినిమా ఏంటో వెంకీ, వరుణ్ తేజ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఏంటో?????కథ :-
ఒక  MLA గారి పీ గా కాకుండా, పీ గారికే  అతను MLA అనేంత పేరు తెచ్చుకుని MLA బాగానే సంపాదించి, ముదిరిపోతున్న వయసులో  పెళ్లికోసం సంబంధాలు చూస్తున్న వెంకీ కి ,అదే సమయంలో రోజుల్లో ఒక కామన్ అమ్మాయిలాగా అలోచించి అత్త మామ ఆడపడుచులు లేకుండా ఉన్న సంబంధం చూస్తున్న హారిక (తమన్నా) ఒక సగటు సాఫ్ట్ వేర్  ఇంజనీర్ (!) కు మ్యాచ్ ఫిక్స్ చేసి పెళ్లి చేస్తారు , కానీ పెళ్లి తరువాత భార్యా భర్తల మధ్య వచ్చే కామన్ అండ్ సిల్లీ గొడవలు  జరుగుతుంటాయి అదే సమయంలో హనీ (మెహ్రీన్) అక్క ఇంట్లో దిగుతుంది , అక్కడ కూడా హనీ వలన చిన్న చిన్న గొడవలు జరిగి భార్యా భర్తల మధ్య పొరపొచ్చాలు జరుగుతుంటాయి..
తన భార్య వలన , భార్య పేరెంట్స్ వలన వచ్చే జరిగే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేని వెంకీ వాళ్ళ భాధ నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమౌతున్న సమయంలో హనీ (మెహ్రీన్) తన లవర్      వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) తో వెంకీ కి దొరికిపోతుంది , ఇష్యూ తో హనీ ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అనుకున్న వెంకీ ని తెలివిగా బోల్తా కొట్టించి , అప్పటికే ఒక రేంజ్ లో వెంకీ తో ఆడుకుంటున్న ఫామిలీ , హనీ తో వరుణ్ యాదవ్ పెళ్లి ఫిక్స్ చేస్తారు, ఎంగేజ్ మెంట్ లోపే అసలు సిసలు ఆడాళ్ళ సంగతేంటో , పెళ్లి ఏంటో అని తెలుసుకున్న వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) , పెళ్ళి తనకు వొద్దని తనని పెళ్ళి నుండి తప్పించమని వెంకీతో మొర పెట్టుకుంటాడు అదే సమయంలో ఇద్దరు భార్యల వల్ల నరకం అనుభవిస్తున్న రాజేంద్ర ప్రసాద్ సలహాతో ముగ్గురు వరుణ్,  మెహ్రీన్ పెళ్లి రోజు ఎవ్వరికీ చెప్పకుండా ముగ్గురు కలిసి యూరప్ వెళ్ళిపోతారు.

ఇప్పుడు ఇంక యూరప్ వెళ్లిన ముగ్గురు ఏం అయ్యారు భార్యలు భర్తలను గెలిచారా, భర్తలు భార్యలను గెలిచారా అనేది సెకండ్ హాఫ్....
 పాత్రలు:-
వెంకటేష్ ఒకప్పుడు తన సెంటిమెంట్ కామెడీతో ఎన్నో మరిచిపోలేని పాత్రలు చేసిన వెంకీ కి పాత్రా పెద్ద కొత్తదేం కాదు, కానీ సినిమాలో కామెడీ పండించడంలో మాత్రం వెంకీ దే పై చేయి, సినిమా మొత్తం లో కామెడీ టైమింగ్ వెంకీ దే సూపర్.. ఇదే జోష్ లో వెంకీ మరిన్ని మంచి గొప్ప పాత్రలు చేసిన చేస్తాడు.

సినిమాలో చెప్పినట్టు పెళ్ళికి ముందు  పెళ్ళికి తరువాత లాగ, F2 కి ముందు F2 కి తరువాత వెంకీ అని చెప్పుకోవచ్చు, అంత అద్భుతంగా నవ్వించాడు వెంకీ..
వరుణ్ తేజ్ వరుణ్ యాదవ్ పాత్రలో చాలా ఇమిడిపోయాడు , తొలిసారి సినిమా మొత్తం తెలంగాణ భాషలో మాట్లాడిన వరుణ్ మార్కులు కొట్టేసాడు అనే చెప్పాలి.
తమన్నా , మెహ్రీన్ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు.., మిగతా ఆర్టిస్ట్ లు అంత వాళ్ళ వాళ్ళ పాత్రలు ఆలా చేసేసారు అంతే..
సెకండ్ హాఫ్ మొదలవ్వగానే నెమ్మదించిన సినిమా ప్రీ క్లైమాక్స్ కి ముందు మళ్ళి ఊపు అందుకుంది..

విశ్లేషణ : –

అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నపుడే సినిమా సగం హిట్ అయినట్టే, ఎందుకంటె భార్యా భర్తల మధ్య గొడవలు ,మళ్ళి కలవడాలు అనే సబ్జెక్టు మనిషి ఇగో మీద ఆధారపడి ఉంటుంది , ఇలాంటి కామెడీ ఫ్యామిలీ సినిమాలకు వచ్చేది ఫామిలీ ఆడియన్స్ కాబట్టి వాళ్ళ ఇగో లు Satisfy చేయగలిగితే అంతే చాలు సినిమా సూపర్ హిట్టే అదే సినిమాకు జరిగింది .
ముందే చెప్పుకున్నట్టు సినిమా మొత్తం తన వెంకీ ఆసనంతో విక్టరీ వెంకటేష్ సినిమా మొత్తాన్ని ముందుండి నడిపించాడు..

మొత్తానికి సంక్రాంతి పండక్కితెలుగువాళ్ళ సినిమాలేఉండాలి తమిళ్సినిమాలు ఏంటిఅని ఏదోకామెంట్స్ చేసినదిల్ రాజుతెలుగుదనం నిండినతెలుగు కామెడీసినిమా నుమనకు అందించారు, సినిమా చూస్తున్నంతసేపు నేను పడీపడీ నవ్వాను, కొంత మందిఆడియన్స్ అయితేకుర్చీ లోంచి కూడా కింద పడి నవ్వారు అది వేరే విషయం అనుకోండి!!!! ,
ఫైనల్ గా ఈ సంక్రాంతి విజేతలు ఈ సరదా తోడు అల్లుళ్ళు..
F2 అంటే ఫన్ & ఫ్రస్ట్రేషన్ కాదు  ఫుల్  ఫన్…
                                               

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Majili Teaser | Samantha Naga Chaitanya Majili first look teaser | tollywood friends

Sun Jan 13 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: