
తెలుసో, తెలియదో ! 1984 ప్రాంతములో విజయవాడ లో సెల్వరాజ్ అను తమిళియన్ పక్కా ప్లాన్ తో చేసిన మోసం.
ఒక గోడౌన్ కిరాయికి తీసుకోని కొంత డబ్బుతో వాషింగ్ మెషిన్లు , మిక్సీలు , ఫ్రిడ్జ్ ఇంకా ఆ నాటి విద్యుత్ వంటయింటి సామాగ్రి , ఫర్నిచర్ లోకల్ డీలర్స్ వద్ద కొని, ప్రకటనలు గుప్పించాడు.
ఏ వస్తువు ఐనా సగం ధర చెల్లించి, మిగతావి వాయిదాల పద్దతిలో కట్టవచ్చు. సభ్యత్వ రుసుము కట్టి చేరవచ్చును. లోకల్ సేల్స్ మాన్ లు , మేనేజర్స్ ను నియనించాడు.
ఇంకేముంది ఆడవారు పోటీపడి క్యూ లో నిలబడి ఎగ బడ్డారు. ముందు వచ్చినవారు అదృష్టవంతులు. స్టాక్ పెట్టినంతవరకు సగం ధరకు ఇంటికి, సిబ్బందితో చేర్చేవాడు.
మిగతా వారు సగం డబ్బు కట్టి సీరియల్ లైవ్ రిజిస్టర్ లో నమోదు చేయించుకునేవారు. లోకల్ డీలర్స్ కు వ్యాపారము బాగుంది అనుకోని వాళ్ళు కూడా పోటా పోటీ పై సరుకు కొంత నగదు కొంత అప్పు మీద సరఫరా చేసేవారు.
ఒక నెల రోజులు సాగించాడు. ఆడువారు ఇంకా ఎగబడుతున్నారు. సంకోచం లేకుండా వారికి కావాల్సిన వస్తువుకు సగం ధర చెల్లించి వెయిట్ లిస్ట్ లో ఉండేవారు.

లోకల్ డీలర్స్ కొత్త స్టాక్ కొని పేమెంట్ లేటర్ పద్ధతి మీద ఇచ్చేవారు. స్టాక్ పరిమితం -వెయిట్ లిస్ట్ అపరిమితం. ఈ విధముగా డీలర్ -వెయిట్ లిస్ట్ అమ్మల నుండి రెండు మూడు కోట్లు కలెక్ట్ చేసి ఒక అర్ధరాత్రి మాయం అయ్యాడు.
గోడౌన్ ఖాళీ. కట్టిన డబ్బు తో సెల్వ రాజ్ పరార్.
సెల్వ రాజ్ తెలివితేటలు ఆ రోజుల్లో హాట్ టాపిక్.
విశేషము ఏమంటే సాధారణ మహిళలు కాకుండా అన్ని తరగతుల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ముందుకు రావడము.
పోలీసులు కేసు చేపట్టిన కొంత కాలానికి పట్టు పడ్డాడు. కానీ డబ్బు రికవరీ జరిగిందీ లేనిది తెలియదు.