LIger Movie Update: Rowdy Boy Vijay Devarakonda And LIger Team Floating In Bollywood Parties Photos Goes Viral On Social Media


గీతా గోవిందంలో ఏమీ తెలియని అమాయకుడిలా, అర్జున్‌ రెడ్డిలో అందరినీ ఎదిరించే రౌడీలా నటించడం ఒక్క విజయ్‌ దేవరకొండకే చెల్లింది. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసే విజయ్‌ ప్రస్తుతం “లైగర్‌: సాలా క్రాస్‌ బ్రీడ్”‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారిగా బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాతగా పని చేస్తున్నాడు. ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో చిత్రయూనిట్‌ ఫిబ్రవరి నెలారంబంలోనే ముంబైకి మకాం మార్చింది. ఈ క్రమంలో తరచూ అక్కడి బీటౌన్‌ సెలబ్రిటీలను కలుస్తూ, హడావుడి చేస్తూ బాలీవుడ్‌ టీమ్‌గా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను నటి, నిర్మాత ఛార్మీకౌర్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.

ఈ నేపథ్యంలో లైగర్‌ టీమ్‌ పార్టీ చేసుకున్న ఫొటోలను ఛార్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘ఈ పార్టీని ఏర్పాటు చేసిన మనీష్‌కు కృతజ్ఞతలు. పార్టీ చాలా సంతోషంగా గడిచింది. అమేజింగ్‌ ఫుడ్‌, అమేజింగ్‌ పీపుల్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ పార్టీలో చార్మీ, విజయ్‌ దేవరకొండతో పాటు బాలీవుడ్‌ హీరోయిన్లు కియారా అద్వాణీ, సారా అలీఖాన్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా, నిర్మాత కరణ్‌ జోహార్‌ పాల్గొనడం విశేషం. దీంతో ఈ బాలీవుడ్‌ పార్టీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇటేవలే కరణ్‌ నివాసంలో జరిగిన పార్టీకి సైతం విజయ్‌కు ఆహ్వానం అందగా అక్కడి స్టార్‌ నటులు దీపికా పదుకొనె, అనన్య పాండే, సిద్దార్థ్‌ చతుర్వేది, ఇషాన్‌ ఖట్టర్‌ సహా తదితరులతో కలిసి పార్టీని ఎంజాయ్‌ చేశాడు. ఇక లైగర్‌ సినిమా విషయానికొస్తే ఇందులో అనన్య పాండే కథానాయికగా కనిపించనుండగా బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.


చదవండి: ఫ్యాన్‌ మూమెంట్‌: విజయ్‌తో సారా సెల్పీ

భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక



Source link


Like it? Share with your friends!

379
379 points

0 Comments

Leave a Reply

What's Your Reaction?

hate hate
0
hate
confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
geeky geeky
0
geeky
love love
0
love
lol lol
0
lol
omg omg
0
omg
win win
0
win
cinemarascals

[fiverr_affiliates_search_box width="100%"]
Choose A Format
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge
Poll
Voting to make decisions or determine opinions
Story
Formatted Text with Embeds and Visuals
List
The Classic Internet Listicles
Countdown
The Classic Internet Countdowns
Open List
Submit your own item and vote up for the best submission
Ranked List
Upvote or downvote to decide the best list item
Meme
Upload your own images to make custom memes
Video
Youtube, Vimeo or Vine Embeds
Audio
Soundcloud or Mixcloud Embeds
Image
Photo or GIF
Gif
GIF format
%d bloggers like this: