adipurush

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆయన రాధేశ్యామ్ సినిమా వచ్చే ఇయర్ అంటే 2021లో రిలీజ్ అవుతుండగా ఇక ప్రభాస్ లేటెస్ట్ గా ఒప్పుకున్న ఆది పురుష్ సినిమాను 2022లో ఆగస్టు 11వ తారుఖున ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నట్లుగా సినిమా దర్శక నిర్మాతలు ప్రకటించారు.

adipurush

ప్రభాస్ ఆది పురుష్ సినిమా రిలీజ్ 2022లో!!!!

అయితే ఇప్పటికే దాదాపు రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్ సినిమాలలో ఇక మిగిలిన సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ మీద మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న సైన్సు ఫిక్షన్ సినిమా రిలీజ్ డేట్ ఒక్కటే మిగిలిపోయింది అయితే ఆ సినిమాను 2023లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లుగా కూడా టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ లెక్కన ప్రభాస్ వరసగా మూడు సంవత్సరాలలో మూడు సినిమాలు వస్తాయి. బాహుబలి కోసం దాదాపు ఐదు సంవత్సరాలు ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు ఆ సినిమా ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. మరి ఇప్పుడు ప్రభాస్ తన ఫాన్స్ ను ఇక ఏ మాత్రం అన్ని సంవత్సరాలు వెయిట్ చేయించడానికి ఇష్ట పడుతున్నట్లు కనిపించడం లేదు అందుకే ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.     

Leave a Reply