0.6 C
New York
January 26, 2021
CINEMA RASCALS
Entertainment News Latest Movies reviews Trending Now

తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఎంట్రీ!!!!

తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఎంట్రీ!!!!

తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఎంట్రీ!!!!

వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ ఎన్ని రోజులుగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి అటు అభిమానులను ఇటు సాధారణ ప్రజలను ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్ ఎట్టకేలకు ఈ రోజు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను అని జనవరిలో పార్టీ కూడా పెడతాను అని అధికారికంగా చెన్నై లోని తన నివాసంలో ప్రకటించారు.దీంతో వచ్చే సంవత్సరం మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఎంట్రీ!!!!

ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో చాలా సంవత్సరాల వరకు జయలలిత, కరుణానిధిలు మాత్రమే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తు వచ్చారు. అయితే దాదాపు రెండు సంవత్సరాల వ్యవధిలో వాళ్ళిద్దరు కూడా అనుకోకుండా మరణించడంతో తమిళనాడులో ఒక విధమైన రాజకీయ శూన్యత అన్నది ఏర్పడింది. తమిళ నాడు రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా ఏ రాజకీయ పార్టీ నేత కూడా ఉండలేకపోయారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత ఆమె పార్టీ అయిన అన్నాడిఎంకె రెండుగా చీలిపోయి పార్టీ రెండు వర్గాలుగా మారి వారి మధ్య ఎన్నో గొడవలు కూడా జరిగాయి చివరికి ఏదో విధంగా వాళ్లలో వాళ్లు మళ్లీ కలిసిపోయి ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం నడిపిస్తున్నారు.

తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఎంట్రీ!!!!

ఇక కరుణానిధి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన అతని కుమారుడు డీఎంకే అధ్యక్షుడు అయిన స్టాలిన్ కూడా అవకాశం దొరికితే తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని తండ్రిలాగే తాను కూడా తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఎంతో ఆశ పడుతున్నారు. మరో వైపు ప్రముఖ సినీ నటుడు అయిన కమల్ హాసన్ తన సొంత పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు అని చెప్పాలి. అవసరం వచ్చినప్పుడల్లా ఆయన ప్రజల్లోకి వెళుతూ అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ కూడా కమలహాసన్ స్వతహాగా మాస్ లీడర్ కాకపోవడంతో అతను ఎక్కువగా జనాలను ఆకట్టుకోలేక పోతున్నాడు అని చెప్పుకోవచ్చు.

ఇలాంటి సందర్భంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చేస్తాడు అని చాలా మంది ఆశిస్తూ వచ్చారు. అయితే గత నెలరోజుల నుంచి అనూహ్యంగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యం అంతగా బాగోలేదు అని ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో అతను జనంలోకి వెళ్లి ప్రచారం చేయడం రాజకీయాల్లోకి రావడం అన్నది ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది అని డాక్టర్లు చెప్పారు అన్న విషయం కూడా బయట మీడియాకు లీక్ అయింది. అయితే ఆ విషయం గురించి రజనీకాంత్ కొట్టిపారేసినప్పటికీ తన ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా ప్రమాదం ఉంది అని ఒప్పుకున్నారు.

Image

మరి అలాంటి పరిస్థితుల్లో రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మరోసారి తన అభిమాన సంఘాల నేతలతో గత వారమే సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశంలో అభిమాన సంఘాల నేతలు మాత్రం రజనీకాంత్ ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఆయన రాజకీయాల్లోకి రావడం రాకపోవడం అన్నది అతని సొంత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దాంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న టెన్షన్ కూడా చాలా మందిలో మొదలైంది.రజనీకాంత్ ఆరోగ్యం అంతగా సహకరించదు అని ఆయన రాజకీయాల్లోకి ఇక రారు అని పార్టీ పెట్టకుండానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయకుండానే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని చాలా వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పుడు రజనీ కాంత్ మాత్రం తనదైన స్టైల్ లో అందరికీ షాక్ ఇస్తూ తాను రాజకీయాల్లోకి వస్తున్నానని పార్టీ కూడా పెట్టి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి ఒక పెద్ద సంచలనానికి తెరతీశారు.ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అంటూ తమిళనాడు రాష్ట్రాన్ని మార్చి వేస్తానంటూ అతి త్వరలో తమిళనాడులో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది అంటూ తాను ఎన్నికల్లో గెలిస్తే అది కచ్చితంగా తమిళనాడు ప్రజల గెలుపే అంటూ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.నిజానికి తాను తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేసి ఆ తర్వాత పార్టీని ప్రకటించాలని అనుకున్నానని అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు అని అందుకే రాష్ట్రంలో పర్యటించకుండానే పార్టీని ప్రకటిస్తున్నాను అని ఆయన చెప్పారు.

తమిళనాడులో అతి పెద్ద సినీ స్టార్స్ అయిన విజయ్, అజిత్ కూడా తమిళనాడు రాజకీయాల్లోకి వస్తారు అని ఆ మధ్య గాసిప్స్ వినిపించాయి. హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించారు అది హీరో విజయ్ పార్టీ అని విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారు అని ప్రచారం కూడా జరిగింది. అయితే హీరో విజయ్ మాత్రం వాటిని కొట్టి పారేశారు అలాగే తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ప్రచారంలో కానీ లేదా మిగతా విషయాల్లో కానీ తన పేరును తన ఫోటో ని కూడా వాడుకోవద్దు అని అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని విజయ్ ప్రకటించారు.ఏదిఏమైనప్పటికీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ రావడంతో ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related posts

వైరల్ అవుతున్న ధోని హార్డిక్ పాండ్య సచ్ మె వీడియో

cinemarascals

CHAMPAGNE CELEBRATING #issmartshankar WITH ITS LOVELIES ⁦@Charmmeofficial⁩ ⁦@NabhaNatesh and ⁩ ⁦@AgerwalNidhh

cinemarascals

Master producers demand Rs 25 crore as compensation for leaked scenes: Report

cinemarascals

Leave a Comment