రెమ్యునరేషన్ విషయంలో తగ్గని మాస్ మహారాజ
రవితేజ ప్రస్తుతం చాలా బిజీ గా ఉన్నారు. క్రాక్ సినిమా షూటింగ్ పూర్తయ్యి, సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. రీసెంట్ గా ఖిలాడి అనే సినిమా కూడా ఒప్పుకున్నారు రవితేజ.
ఈ కరోనా సమయంలో కలెక్షన్స్ విషయం పక్కన పెడితే మని హ్యాండ్ మారడం లేదన్న విషయం తెలిసిందే… దీంతో హీరోలా డిమాండ్ తో పాటు వారి రెమ్యునరేషన్ లు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. అలాగే రవితేజ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన పాత సినిమాలే సెట్స్ మీదకి వెళ్తున్నాయి కాని, కొత్తగా ఒకే అవుతున్న సినిమాలేవి స్టార్ట్ అవ్వట్లేదు.
రెమ్యునరేషన్ విషయంలో తగ్గని మాస్ మహారాజ
తనతో సినిమా చెయ్యాలంటే 12 కోట్లు ఇవ్వాలని తెలుస్తుంది. ఖిలాడి సినిమాకి 12 కోట్లు సింగల్ పేమెంట్ తీసుకొని చేస్తున్నాడని తెలుస్తుంది. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ అయ్యే క్రాక్ గనక హిట్ అవుతే రవితేజ రెమ్యునరేషన్ 13 కోట్లకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు….