రవితేజ క్రాక్ మూవీ రివ్యూ పైసా వసూల్ ఎంటర్టైనర్
రేటింగ్ : 3/5
నటీనటులు: రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీ శ్రీ ప్రసాద్, చిరగ్.
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఎడిటింగ్: నవీన్ నూలి
దర్శకత్వం : గోపీచంద్ మలినేని
మాస్ మహారాజ రవితేజకు మాస్ సినిమాలు ఇప్పటి వరకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఆయన నుంచి ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ వస్తుంది అంటే అటు మాస్ ప్రేక్షకులతో పాటు ఇటు క్లాస్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన తన ఎనర్జీ అలాగే కామెడీ సీన్స్ అండ్ ఫైట్స్ తో చూసేవారికి ఒక మంచి విందు భోజనం చేసిన ఫీల్ తెప్పిస్తారు తన నటనతో ఇక ఈ కరోనా వచ్చాకా సినిమాలు ఆగిపోవడం మొన్న రిలీజ్ అయిన సోలో బతుకే సో బెటర్ కూడా కొంచెం క్లాస్ మూవీ కావడంతో జనాలు అందరూ ఒక మంచి హుషారైన మాస్ ఎంటర్టైనర్ కోసం వెయిట్ చేస్తున్నారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక ట్రైలర్ నుంచే రవితేజ ఆడియెన్స్ కు మీరు కోరుకునేది ఇస్తున్నా అంటూ హింట్ ఇచ్చేశారు. మరి సినిమా ఎలా ఉంది వరస ఫ్లాప్ లతో సఫర్ అవుతున్న రవితేజకు హిట్ ఈ సంక్రాంతి ఇచ్చిందా లేదా చూద్దాం.
కథ :
వీరశంకర్ పోతురాజు(రవితేజ) అనే సిఐ కు అలాగే కటారి కృష్ణ (సముద్ర ఖని) అనే ఒక క్రిమినల్ మధ్య జరిగే కథ ఇది.
నిజానికి ఇది రెగ్యులర్ మాస్ సినిమాల్లో ఉండే హీరో అండ్ విలన్ కథే. బడా హీరో మొదలు అప్పుడప్పుడే హీరోలు అయ్యి తాము మాస్ అనిపించుకోవాలి అని కుర్ర హీరోలు చేసే ఫక్తు మాస్ కథనే ఇది.
విశ్లేషణ :
రవితేజ అంటేనే మాస్ అండ్ కామెడీకి పేరు ఆ మధ్య ఆయన కొన్ని క్లాస్ సినిమాలు చేసినా ఆడియెన్స్ మాత్రమే ఆయన్ని మాస్ మహరాజ్ అన్నారు. ఈ సినిమాలో ఆయన మాస్ కోసమే అన్నీ చేశారు. అక్కడక్కడ క్లాస్ కోసం ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కూడా సినిమా మొత్తం మాస్ డామినేట్ చేసింది. ముఖ్యంగా రవితేజ బిల్డప్ సీన్స్ అలాగే ఆయన చెప్పే డైలాగ్స్ కొన్ని మరీ మాస్ మొరటు మాటలు కూడా ఇది పక్కా మాస్ సినిమా అనే మనకు చెపుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత రవితేజ తన పాత్రను బాగా ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ చేశారు అనేది మనకు ప్రతి సీన్ లో తెలిసిపోతుంది. హీరో, విలన్ గేమ్ ఇంటర్వల్ వరకు స్టార్ట్ అవకున్నా కూడా సినిమా మొదట్లోనే విలన్ దగ్గరికి వెళ్ళి అతని కథ అడగడం దాంతో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవడంతో మనకు సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వస్తుంది.
రవితేజ క్రాక్ మూవీ రివ్యూ పైసా వసూల్ ఎంటర్టైనర్
హీరోగా రవితేజ చేసిన యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంతలా ఆయన ఈ సినిమాలో చెలరేగి పోయాడు ముఖ్యంగా ఫైట్స్ అండ్ కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే సందర్భాల్లో ఆయన ఆడియెన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తారు.పేరుకు ఆయన పాత్ర క్రాక్ పోలీస్ అయినా కూడా అందుకోసం రాసుకున్న సీన్స్ అండ్ ఫైట్స్ మనకు కొంచెం మరీ ఓవర్ అనిపించినా మాస్ సినిమా కాబట్టి ఇదే మాస్ అని సరిపెట్టుకుంటాం. హీరోయిన్ శృతి హాసన్ కు పెద్ద పాత్ర ఏమీ ఇవ్వలేదు కానీ ఇలాంటి మాస్ సినిమాల్లో హీరోయిన్ గా తనేం చేయాలో అంతా చేసింది ఆ గ్లామర్ కూడా మాస్ ప్రేక్షకుల కోసం బాగానే ఒలకబోసింది.
విలన్ గా సముద్ర ఖని నటన చాలా బాగుంది రెగ్యులర్ విలన్స్ తో బాగా ఇబ్బంది పడుతున్న తెలుగు దర్శకులకు మరొక మంచి విలన్ దొరికినట్టే మరి సముద్రఖనిని మన తెలుగు దర్శకులు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. మిగతా నటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేసినా ముందే చెప్పుకున్నట్లు ఇది హీరో అండ్ విలన్ కథే కాబట్టి వాళ్లే సినిమాలో హైలైట్ అయ్యారు. దర్శకుడు గోపిచంద్ మలినేని వరస ఫ్లాప్స్ ఇచ్చినప్పటికీ రవితేజ తో మాత్రం డాన్ శీను, బలుపు తర్వాత సినిమా చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే అనుకోవాలి. సినిమా కోసం ఆయన పడ్డ కష్టం, పక్కా మాస్ సినిమా అయినా రెగ్యులర్ కథే అయినా అక్కడక్కడ కొత్తదనం కోసం ఆయన పడిన తపన సినిమాలో మనకు కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆయనకు పెద్ద హీరో సినిమా దొరికినా ఆశ్చర్య పోవద్దు అంతగా హీరోకు మాస్ ఎలివేశన్స్ ఇచ్చారు ఆయన మేకింగ్ చాలా బాగుంది.
అల వైకుంఠపురములో సినిమాతో తన కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ముఖ్యంగా అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక సాంగ్స్ లో మాస్ బిరియాని నిజంగానే మాస్ ప్రేక్షకులకు ఊపు తీసుకు వచ్చి బిర్యానీ పెట్టిన ఫీలింగ్ ఇస్తుంది. ఇక సినిమాలో మరొక హైలైట్ జి.కె.విష్ణు విజువల్స్ ఒక మాస్ సినిమాకు ఆయన అద్భుతమైన విజువల్స్ ఇవ్వడమే కాకుండా కేక పుట్టించే షాట్స్ తో తన కెమెరా పనితనం చూపించారు తమిల్ లో హీరో విజయ్ అండ్ డైరెక్టర్ అట్లీ లా కాంబినేషన్ లో వచ్చిన తేరి, అదిరింది లాంటి సినిమాలకు పనిచేసిన ఈయన ఈ సినిమాతో తెలుగులో కూడా బిజీ అవుతారు. ఈ సినిమా అటు మాస్ చేత విజిల్స్ వేయిస్తు ఇటు క్లాస్ ప్రేక్షకుల ఇంట్రెస్టింగ్ గా చూసేలా చేస్తుంది. ఈ విషయంలో రామ్ లక్ష్మణ్ ఫైట్ ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ముఖ్యంగా ఒంగోలు బస్టాండ్ ఫైట్ అయితే సినిమా మొత్తానికే హైలైట్ అవుతుంది, ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా టాప్ లెవల్ లో ఉన్నాయి. డైలాగ్స్ పరంగా సాయి మాధవ్ బుర్ర గారు ఇప్పటి వరకు బాగా క్లాస్ గానే రాశారు కానీ మొదటిసారి మాస్ సినిమా కు రాస్తూ నవ రంధ్రాలు అంటూ ఆయన ఊర మాస్ డైలాగ్స్ రాసే ప్రయత్నం చేశారు.
చివరగా :
సంక్రాంతికి మాస్ సినిమాలకు ఎప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంటుంది అందులోనూ రవితేజ లాంటి హీరో సినిమా కొంచెం బాగున్నా కూడా అది హిట్ అవుతుంది.ఈ సంక్రాంతి కి రవితేజ హిట్టు కొట్టినట్టే అనుకోవాలి.