ప్రేమలో మోసపోయాను – రేణు దేశాయ్

ప్రేమలో మోసపోయాను - రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రముఖ నటి. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కుంభస్థలం బద్దలు కొట్టినట్టు ఉంటుంది. రేణు దేశాయ్ రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో లైవ్ వెళ్లారు. ఆ లైవ్ లో ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆ భాధ ఎలా ఉంటుందో తెలిపారు. ఆమె చెప్పిన విషయాలు కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ప్రేమ ఎంతో మధురమైనది, దాంట్లో విఫలమైతే మానసిక స్థితి బాగుండదు అని చెప్పారు. ఆ భాదను తట్టుకోవడం చాల కష్టం అన్నారు. ప్రేమే జీవితo కాదు. అది లేకుండా కూడా బతకవచ్చు, అలాంటి భావనలను అస్ఆలు మీ మనసులోకి రానివ్వద్దు అని చెప్పారు. ఒకవేళ ప్రేమించినా కూడా అందులో ఫెయిల్ అయినా, బ్రేక్ అప్ అయినా కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అని తెలిపారు. మనం మోసపోయాం అన్న ఆలోచన వస్తే అది చాల బాధ కలిగిస్తుందని చెప్పారు.

ప్రేమలో మోసపోయాను – రేణు దేశాయ్

ప్రేమలో విఫలమైతే అది ఎంత భాధగా ఉంటుందో తను కూడా అనుభవించాను అన్నారు. మనసు ఎప్పుడూ మన అదుపులోనే ఉంచుకోవాలి, ఆ భాదను మర్చిపోయి కొత్త లైఫ్ ని ప్రారంభించాలి అన్నారు. ఆ సమయంలో ఫ్రెండ్స్, పేరెంట్స్, రెలతివెస్ సహాయం ఎంత అవసరమని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకేలా ఉండడం తన ఆలోచనలు అని తెలిపారు. ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు అని తను ప్రత్యేకంగా తెలిపారు.   

Leave a Reply