ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా ఇదే…!

ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా ఇదే...!

కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్లు కొట్టిన మొదటి యాక్షన్ సినిమా కెజిఎఫ్. ఫైట్స్ తో, పాటలతో మంచి హిట్ కొట్టిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కెజిఎఫ్ 2 షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి దానికంటే భారి హిట్ అవుతుందని అన్నారు. ఇకపోతే ప్రభాస్ బాహుబలి తర్వత రాదే శ్యామ్, ఆదిపురుష్ లతో పాటు ఇంకో సినిమా చేస్తున్నారు. రాదే శ్యామ్ 2021లో, ఆదిపురుష్ 2022 లో అని అనౌన్స్మెంట్ ఇచ్చేసారు.

Image

ఈ మధ్య సోషల్ మీడియా లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిన కథ విన్నాడని, ఆ సినిమాకి ఓకే చెప్పాడని, ఈ సినిమాలో ఫుల్ గా యాక్షన్ ఉంటుందన్న వార్త వస్తుంది. అయితే ఈ అనౌన్స్మెంట్ మరో రెండు రోజుల్లో వస్తుందని తెలుస్తుంది. కన్నడలో ఐదేళ్ళ క్రితం వచ్చిన ఉగ్రం సినిమానే పాన్ ఇండియా సినిమాగా తీస్తారని, ఆల్రెడీ కన్నడలో వచ్చింది కాబట్టి కొంచెం కథ మార్చి తేసే ఛాన్సేస్ ఉన్నాయని తెలుస్తుంది.

Image

ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ప్రభాస్ ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమా చేస్తున్నారు, ఈ సినిమా రాదే శ్యామ్ సినిమా కంటే ముందే విడుదల అవుతుందని తెలుస్తుంది. మరిన్ని వివరాలు తెలియాలంటే అనౌన్స్మెంట్ రావాల్సిందే….    

Leave a Reply